అఖండ 2 వాయిదా అంతమందిని టెన్షన్ పడుతుందా..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటన సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత ఈ మూవీ బృందం వారు ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 వ తేదీన రాత్రి నుండే ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


అందుకు అనుగుణంగా ఈ మూవీ టికెట్ బుకింగ్లను కూడా ఓపెన్ చేశారు. అంతా సజావుగా జరుగుతుంది అనుకునే లోపే సడన్గా ఈ మూవీ నిర్మాతలు ఓ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంది అని , ఆ డబ్బులు చెల్లిస్తేనే ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అవుతుందని లేదంటే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అయింది. వార్త వైరల్ అయిన విధం గానే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. దానితో అఖండ 2 మూవీ ని ఎప్పుడు విడుదల చేస్తారా అని అనేక మంది సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఎదురు చూస్తున్నారు.


అందుకు ప్రధాన కారణం ఇప్పటికే కార్తీ హీరోగా రూపొందిన అన్నగారు వస్తారు సినిమాని డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు , ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన శంబాల మూవీ ని డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఒక వేళ అఖండ 2 మూవీ ని ఈ రెండు తేదీలలో ఎప్పుడు విడుదల చేసినా కూడా అందులో ఒక సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని , లేదా ఒక వేళ సినిమాను విడుదల చేసిన వాటికి భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: