ఆ స్టార్ హీరోయిన్ కి పొగరెక్కువ.. ఆ నటుడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందిగా..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మణులలో సాయి పల్లవి ఒకరు. ఈమె మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ అనే మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె వరుణ్ తేజ్ హీరో గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు సాయి పల్లవి తెలుగు లో ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె దాదాపు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంది. తన సినిమా పనులు తాను చూసుకుంటూ సైలెంట్ గా కెరీర్ను ముందుకు సాగిస్తూ వెళుతుంది.


ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం సాయి పల్లవి , నాగ శౌర్య హీరో గా రూపొందిన కణం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా సమయం లో నాగ శౌర్య , సాయి పల్లవి మధ్య  ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నాగ శౌర్య కొంత కాలం క్రితం సాయి పల్లవి కి పొగరు ఎక్కువ , ఆటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ. ఆమె సినిమా షూటింగ్ కి అస్సలు సమయానికి రాదు. హీరోలతో సరిగ్గా మాట్లాడదు అని కామెంట్స్ చేసాడు. ఇక నాగ శౌర్య ఇలా కామెంట్స్ చేసిన తర్వాత సాయి పల్లవి ఏ మాత్రం సైలెంట్ గా లేదు.
 


సాయి పల్లవి ఆ తర్వాత కణం మూవీ దర్శకుడు కి ఫోన్ చేసి సార్ నేను మీ సినిమా చేసే సమయంలో ఎప్పుడైనా సినిమా షూటింగ్ కి లెట్ గా వచ్చానా ..? ఎవరితో నైనా తప్పుగా ప్రవర్తించానా ..? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ..? అని అడిగిందట. కానీ దానికి దర్శకుడు నీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. నీవల్ల సినిమాకు ఎలాంటి నష్టం కలగలేదు అని సమాధానం ఇచ్చాడట. ఇక మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నాగ శౌర్య ఒక ఇంటర్వ్యూ లో మాత్రం సాయి పల్లవి పై కాస్త షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇకపోతే ప్రస్తుతం నాగ శౌర్య , సాయి పల్లవి ఇద్దరు కూడా తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: