RC -17:సుకుమార్ తో చరణ్ మూవీ మొదలు ఎప్పుడంటే..?
అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అనే విషయంపై తాజాగా ఒక న్యూస్ టాలీవుడ్లో వైరల్ అవుతోంది. 2026 మే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేల డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. అయితే రామ్ చరణ్ మాత్రం పెద్ది సినిమా విడుదలైన తర్వాత ఒక రెండు నెలలు కుటుంబానికి కేటాయించి ఆ తర్వాత RC -17 సినిమా షూటింగ్ సెట్లో ఎంట్రీ ఇస్తారట. ఈ చిత్రానికి సంబంధించి ఫైనల్ స్క్రిప్టును కూడా డైరెక్టర్ సుకుమార్ లాక్ చేసినట్లుగా తెలిసింది.
ఆమధ్య డైరెక్టర్ రాజమౌళి కూడా సుకుమార్ తదుపరి సినిమాలోని హీరో ఎంట్రీ కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సినిమా స్టోరీ రేంజ్ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. RC -17 సినిమాకి సంబంధించి నటీనటుల విషయాలను కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ చేయబోతోంది చిత్ర బృందం.డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది మొదటిలో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. అందుకే రామ్ చరణ్ పెద్ది సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు.