బిగ్ బాస్ 9: ఇచ్చిన మాట తప్పని దివ్వెల మాధురి.. ఏం చేసిందంటే..?

Divya
తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 మరో కొద్ది రోజులలో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో ఇప్పుడు హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ మధ్య రసవత్తమైన పోటీ కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఫస్ట్ ఫైనల్ లిస్ట్ కోసం ఉత్కంఠంగా సాగిన టాస్కులలో చివరికి విజేతగా కళ్యాణ్ పడాల గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా అయ్యారు. టైటిల్ విన్నర్ రేసులో కూడా నువ్వానేనా అన్నట్టుగా తనూజ, కళ్యాణ్ దూసుకుపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డు కామనర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిలో దివ్వెల మాధురి కూడా ఒకరు.


వైల్డ్ కార్డు ఎంట్రీలలో ఫైర్ బ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి వారం హవా కొనసాగించింది మాధురి. మొదటి వారమే గొడవలతో హౌస్ లో ఇమే పేరు హాట్ టాపిక్ గా మారగా ,ఆ తర్వాత నాగార్జున హెచ్చరించగా తన ఆట మాట తీరుని మార్చుకుంది. అతి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మాధురి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ డొనేట్ చేసి గొప్ప మనసు చాటుకుంది. గతంలో హౌస్ లోకి వెళ్లే ముందు అటు మాధురి, శ్రీనివాస్ ఇద్దరు కూడా ఆ డబ్బులను పేదవారికి తమ వంతు సహాయం చేస్తామంటు తెలియజేశారు.


అలా చెప్పినట్టుగానే శ్రీనివాస్, మాధురి కలసి తమ అనుచరుడుగా ఉన్న లక్ష్మీనారాయణకు బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారిని పరామర్శించి రూ .80 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అలాగే నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామంలో H. కుమారి అనే మహిళ ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళకు ఆర్థిక సహాయం కింద లక్ష పదివేల రూపాయలు చేసామంటు తెలియజేశారు. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్స్ వీరిని ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: