అఖండ 2 వాయిదా.. ఓటీటీ డీల్‌కు ఎదురు దెబ్బేనా... !
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘ అఖండ 2 – తాండవం ’ సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన నెట్‌ఫ్లిక్స్ డీల్‌పై కూడా ప్రభావం పడింది. అఖండ 2 రిలీజ్ తర్వాత కొన్ని వారాల వ్యవధి లో ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ ఆలస్యం కావడంతో ఓటీటీ విడుదల కూడా అస్పష్టంగా మారింది. నెట్‌ఫ్లిక్స్ ముందుగా సినిమా హక్కులను తీసుకున్నప్పటికీ, కొత్త తేదీ ఖరారయ్యే వరకు వారు తమ ప్రమోషనల్ యాక్టివిటీ కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
అఖండ 2 - తాండవం నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాపై అప్పుల సమస్యల్లో చిక్కుకుపోయిన నేపథ్యంలో , కోర్టు ఆదేశాలతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీంతో సినిమా టికెట్ రిజర్వేషన్లు రద్దయ్యాయి. ఇప్పటికే ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలు కూడా నిలిపేశారు. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ గురించి క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో విడుదల అవుతుందో అన్నదానిపై క్లారిటీ వచ్చేంతవరకు ఓటీటీ విడుదల కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అభిమానులు, ఓటీటీ ప్రేక్షకులు రెండూ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. నిర్మాతలు త్వరలోనే క్లారిటీ ఇవ్వాలనే అభిలాషతో ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.