Jr.ఎన్టీఆర్ పై దారుణమైన ట్రోలింగ్.. మతం గురించి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ.!

Pandrala Sravanthi
జూనియర్ ఎన్టీఆర్ పై ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటారు. కేవలం సినిమాల విషయంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఆయన్ని కొంతమంది నెటిజన్స్ ఎప్పుడు ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి ఓ ట్రోలింగ్ నే జూనియర్ ఎన్టీఆర్ పై మళ్ళీ మొదలు పెట్టేసారు. జూనియర్ ఎన్టీఆర్ ని లుక్ పై కొంతమంది చేసే ట్రోల్స్ మరీ దారుణంగా ఉన్నాయి. వింటుంటేనే చాలా దరిద్రంగా అనిపిస్తోంది. మరి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ లుక్ పై ఎందుకు ఈ ట్రోలింగ్ జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ చాలా సంవత్సరాల నుండి మలబార్ గోల్డ్ జ్యువళ్లరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ యాడ్ ప్రమోషన్స్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు మలబార్ గోల్డ్ జ్యువెళ్లరీ యాడ్స్ లో ఎన్టీఆర్ ఏదో ఒక కొత్త రూపంలో కనిపించాల్సిందే.


అలా కొద్ది సంవత్సరాల నుండి ఆయన సరికొత్త లుక్ లో కనిపిస్తూ ఈ యాడ్ చేస్తూ ఉంటారు. అయితే అన్ని బాగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది మలబార్ యాడ్ లో చేసిన ఎన్టీఆర్ లుక్ పై చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా సన్నబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ గడ్డం, ఫేస్,బాడీ పై చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.రీసెంట్ గా మలబార్ కి సంబంధించిన యాడ్లో జూనియర్ ఎన్టీఆర్ గుబురు గడ్డంతో కనిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అలాగే ఈ గెటప్ లో చాలా సన్నగా కూడా మారిపోయారు. అయితే ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఇలా సన్నబడి,గుబురు గడ్డం పెంచుకున్నారు.కానీ కొంతమంది మాత్రం ఈ యాడ్ లో ఎన్టీఆర్ కనిపించాక ట్రోలింగ్ చేస్తున్నారు.


ఏంటి ఎన్టీఆర్ మతం మార్చుకున్నారా అంటూ మతం గురించి తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.అయితే ఈ గెటప్ లో చూస్తే గుబురు గడ్డం కారణంగా ఎన్టీఆర్ ముస్లిం లాగా కనిపిస్తున్నారు.అందుకే ఎన్టీఆర్ మతం గురించి తీస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక మరికొంత మందేమో ఎన్టీఆర్ అన్న కటౌట్ అస్సలు బాలేదు.. ఇలా మారిపోయావేంటన్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. గత యాడ్లతో పోలిస్తే ఈ ఏడాది చేసిన ఎన్టీఆర్ మలబార్ యాడ్ అస్సలు బాలేదు.చాలా డల్ గా నీరసంగా కనిపిస్తున్నాడు. గడ్డం, హెయిర్ స్టైల్ సెట్ కాలేదు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే హీరోలు ఎవరైనా సరే తమ నెక్స్ట్ సినిమాకి తగ్గట్టుగా కటౌట్ మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ఇలా చేశారని గుర్తించాలి అంటూ ఆయన అభిమానులు రీకౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: