బిగ్ బాస్ 9: ఈవారం ఎవరు ఊహించని లేడీ కంటెస్టెంట్ ఔట్..!
13వ వారం నామినేషన్ లో తనూజ, భరణి, సంజన, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి ఉన్నారు. అయితే ఇందులో కళ్యాణ్ మాత్రం ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడంతో సేఫ్ జోన్ లోనే ఉన్నారు. మిగిలిన 6 మందిలో ఈ వారం రీతు చౌదరి హౌస్ నుంచి బయటకు రాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. గతవారం హౌస్లో చేసిన హంగామా వల్ల ఈమె లెక్కలన్నీ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది. రీతూ , పవన్ మధ్య ఉన్న బంధం గురించి సంజన చేసిన కామెంట్స్ వల్ల రీతూ రెచ్చిపోయింది. దీంతో చివరికి నాగార్జున సంజనతో క్షమాపణలు చెప్పించడంతో ఈ ఇష్యూ సర్దుమునిగింది.
ఈవారం కాస్త రీతూకి ఓటింగ్ కూడా తక్కువగా రావడం వల్ల ఎలిమినేట్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే ఈమె బయటకు రాగా ఆదివారం ఈ ఎపిసోడ్ చూపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీతూ అభిమానులు మాత్రం ఫైనల్ లిస్టులో ఉంటుందని భావించినప్పటికీ, కానీ చివరి నిమిషంలో ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ కావడంతో నిరాశలో ఉన్నారు. మరి మిగిలిన 5 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్టులోకి ఎవరు వెళ్తారు? వచ్చేవారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు? అనే విషయం మాత్రం ఆడియన్స్ కి మరింత ఉత్కంఠ పరిచేలా చేస్తోంది. మరి ఈ సారి టైటిల్ విన్నర్ ఎవరో చూడాలి.