చిరంజీవి సినిమాలో దాని పై అనిల్ రావిపూడి స్పెషల్ డబుల్ ఫోకస్..!?

Thota Jaya Madhuri
సూపర్ స్టార్‌లకు కామెడీ టైమింగ్ అంటే ప్రత్యేక గుర్తింపు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, పూర్తిస్థాయి వినోద చిత్రాన్ని రూపొందించాలని దర్శకుడు అనిల్‌ రావిపూడి చాలా కాలంగా ఆశపడ్డాడు. ఆ ఆకాంక్ష సాకారమవుతున్న ప్రాజెక్ట్‌ “మన శంకర వరప్రసాద్ గారు”. టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, మొదటిసారిగా మెగాస్టార్‌తో కలిసి పనిచేస్తుండటంతో ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ ఆశలు ఏర్పడ్డాయి.ఈ సినిమాలో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే అధికారికంగా వెల్లడైందే. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించబోతుండటం ఈ చిత్రంపై ఉన్న హైప్‌ను మరింత పెంచుతోంది. విశేషమేమిటంటే—వెంకటేష్ పాత్ర కూడా పూర్తిగా కామెడీ ట్రాక్‌తో సాగుతుందని టాక్ వినిపిస్తోంది.



అంతేకాదు, సినిమా చివరి దశ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్నట్టు సమాచారం. వచ్చే వారం నుంచి క్లైమాక్స్‌ ప్యాచ్‌వర్క్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయాలని అనిల్ రావిపూడి ఇప్పటికే ప్లాన్ చేసినట్టు మాట్లాడుకుంటున్నారు. మెయిన్ కామెడీ , ఎమోషన్స్ పై ఎక్కువ ఫోఖస్ చేస్తున్నాడట.  ఈ షూట్‌లో కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా మొత్తం ప్రధాన తారాగణం కూడా పాల్గొనబోతోందని తెలిసింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యకలాపాలు సైతం వేగవంతంగా జరుగుతున్నాయి. సినిమా సంక్లిష్ట భాగాలు, విజువల్ ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వంటి అంశాలను టీమ్ శరవేగంగా పూర్తి చేస్తోంది.ఇక ఇటీవల మీడియాతో మాట్లాడిన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మన శంకర వరప్రసాద్ గారు పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. కథలో ఉండే మ్యాజిక్ నాకు బాగా నచ్చింది. స్క్రిప్ట్ నేను విన్నప్పుడు ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది” అని చిరంజీవి తెలిపారు.



అంతేకాదు, అనిల్ రావిపూడి సెట్లో చెప్పే సన్నివేశాలు కూడా చాలా హాస్యప్రధానంగా ఉంటాయని చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “అనిల్ చెప్పే ప్రతి సన్నివేశం కూడా విన్నప్పుడే కడుపుబ్బా నవ్వించేస్తోంది. థియేటర్‌లో చూసే ప్రేక్షకులు అలాగే బాలేదన్నంతగా నవ్వుకుంటారని నాకు నమ్మకం ఉంది” అని చిరు చెప్పారు. ఈ ఏడాది అత్యధిక ఆసక్తిని కలిగిస్తున్న కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా “మన శంకర వరప్రసాద్ గారు” నిలవబోతోందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక థియేటర్స్‌లో చిరంజీవి – వెంకటేష్ ఇద్దరు కలిసి తెరపై కనిపించడం ప్రేక్షకులకు మరో పెద్ద ట్రీట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: