అఖండ2 భవిష్యత్తు ఆరోజే తేలిపోనుందా.. బాలయ్య గురించి నిర్మాత పోస్ట్ వైరల్!

Reddy P Rajasekhar

అఖండ సినిమా విజయం సాధించిన తర్వాత దాని సీక్వెల్ అఖండ 2 పై ప్రేక్షకులు, అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా భవిష్యత్తు రేపు (సోమవారం) కోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. అఖండ 2 కు సంబంధించి కోర్టులో ఉన్న కేసుకు రేపు క్లారిటీ వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కోర్టులో కేసు పరిష్కారం అయితే, సినిమా షూటింగ్ పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు, నిన్న అఖండ 2 నిర్మాతలలో ఒకరైన రామ్ ఆచంట గారి పుట్టినరోజు సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలయ్య ఇచ్చిన సపోర్ట్ గురించి రామ్ ఆచంట మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. రామ్ ఆచంటకు పుట్టినరోజు విషెస్ చెప్పిన బాలయ్య, సినిమా విషయంలోనూ నిర్మాతల వెంట తాను ఉన్నానని స్పష్టం చేశారు. బాలయ్య వెల్లడించిన ఈ సానుకూల విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోర్టు కేసు క్లారిటీ, బాలయ్య అండదండలు రెండూ ఈ సినిమా భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌కు సుమారు రూ. 28 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయికి సంబంధించి ఆర్బిట్రేషన్ కేసులో ఈరోస్ సంస్థకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ బకాయిని చెల్లించే వరకు అఖండ 2 సినిమా విడుదల, పంపిణీ మరియు వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు (Stay) జారీ చేసింది. 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పి, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి వేరు కాదని, రెండు సంస్థల్లో భాగస్వాములుగా రామ్ ఆచంట, గోపి ఆచంట ఉన్నారని ఈరోస్ కోర్టుకు నిరూపించగలిగింది.

నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా విడుదల వాయిదాను ప్రకటిస్తూ, "అనివార్య కారణాల వల్ల #Akhanda2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. అతి త్వరలో సానుకూల అప్‌డేట్‌తో వస్తాము" అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: