వన్స్ మోర్..మళ్లీ ఆ పని చేయబోతున్న మిల్కీ బ్యూటి తమన్నా ?

Thota Jaya Madhuri
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై రోజుకో కొత్త అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే సమాచారం బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, ఈ లిస్ట్‌లోకి మరో హీరోయిన్ కూడా చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అట్లీ – బన్నీ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని, ఆ పాటలో అల్లు అర్జున్ సరసన డాన్స్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోబోతున్నారని ఫిల్మ్ నగర్ లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇటీవలి బ్లాక్‌బస్టర్ “జైలర్”లో కూడా తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ఎంతటి హిట్ అయిందో తెలిసిందే కాబట్టి, ఈ సినిమా కోసం ఆమెను రోప్‌ఇన్ చేయాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.



ఇక షూటింగ్ విషయానికి వస్తే ఎంతో కీలకమైన తదుపరి షెడ్యూల్‌లో అల్లు అర్జున్ – జాన్వీ కపూర్‌లపై ఉన్న ఒక అందమైన లవ్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారట. ఆ సన్నివేశాల తర్వాత దీపికా పదుకోన్ కూడా సెట్స్‌లో జాయిన్ కానుందని సమాచారం. ఇలా స్టార్ హీరోలతో పాటు స్టార్ హీరోయిన్లు వరుసగా షూట్‌లో పాల్గొనడంతో మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ కోసం అట్లీ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథలో బన్నీ ఒక డాన్ పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అట్లీ సినిమా అంటే యాక్షన్, భావోద్వేగాలు, భారీ మేకింగ్ అంటూ ప్రేక్షకులు ఊహించే స్థాయి ఉండటంతో, ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిమానులు నమ్ముతున్నారు.



ఉత్పత్తి విషయానికి వస్తే, ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అట్లీ ఇంకా ప్రత్యేక గెస్ట్ రోల్స్ కోసం కూడా కొన్ని పాత్రలను డిజైన్ చేస్తున్నాడట. ఆ పాత్రల కోసం ఆయన ఏ స్టార్స్‌ను అప్రోచ్ అవుతారో ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బన్నీ – అట్లీ కాంబినేషన్ నేపథ్యంలో అనేక టాప్ హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.మొత్తానికి ఈ ప్రాజెక్టు గురించి వస్తున్న ఒక్కో అప్‌డేట్ అభిమానుల్లో అదిరిపోయే హైప్‌ని క్రియేట్ చేస్తోంది. అధికారిక ప్రకటనలు వరుసగా వెలువడే కొద్దీ ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: