అయ్యో..కోలీవుడ్ లో టాలీవుడ్ హీరోయిన్ కి కష్టాలు.. తీరేదెపుడో ..?
అయితే ఈ చిత్రాలకు ఏ సమయంలో సైన్ చేసిందో కానీ రోజుల తరబడి ఈ సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు వా వాతియార్ సినిమా షూటింగ్ అయిపోయినప్పటికీ పలుసార్లు వాయిదా పడి డిసెంబర్ బరిలో విడుదల కాబోతోంది. వాస్తవంగా రెండు సంవత్సరాల క్రితం కార్తీ మూవీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కృతి శెట్టి. ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పటికీ రెండేళ్లగా ఈ సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా మళ్లీ ఈ సినిమాని 12వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.
ఆ రోజున ఈ సినిమా విడుదలవుతుందా? లేదా అనే సందేహం కూడా అభిమానులలో కనిపిస్తోంది. సుందర్ దాస్ అనే వ్యక్తికి తనకు రావలసిన రూ .21 కోట్ల రూపాయల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రదీప్ రంగనాథన్ తో నటించిన లవ్ ఇన్సూరెన్స్ సినిమా కూడా గత రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అయిపోగా డిసెంబర్ 18న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయడం లేదు. దీంతో ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరో సినిమా జిని కేవలం సాంగ్ తప్ప ఎటువంటి అప్డేట్ కూడా విడుదల చేయలేదు. మరి ఈ సినిమాల పరిస్థితి ఏంటి అన్నది కృతి శెట్టికి ప్రశ్నార్ధకరంగా మారింది.