ఓరి దేవుడోయ్..ఈసారి రాజమౌళి అలా చేయబోతున్నాడా..? వారణాసి గ్లోబల్ ప్లాన్ లీక్..!?

Thota Jaya Madhuri
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శన ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలను సృష్టించింది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని, భారతీయ పురాణాలు మరియు ఆధ్యాత్మిక అంశాలను అద్భుతమైన విజువల్స్‌తో అందించేందుకు రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.మహేష్ బాబుతో కలిసి గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారని పరిశ్రమ వర్గాల సమాచారం. అంతేకాదు, ఇంకా అనేక అంతర్జాతీయ నటులు ఈ చిత్రంలో భాగం అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.



ఇక సినిమాకు సంబంధించి అధికారిక విడుదల తేదీ రిలీజ్ కాకముందే.. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రమోషన్స్ కోసం రాజమౌళి ఓ మెగా ప్లాన్ సిద్ధం చేసినట్లు ఇటీవల ఇండియన్ మరియు హాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రేక్షకులకు మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌ను భారీ స్కేలులో పరిచయం చేసే ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది.మీడియా రిపోర్ట్స్ ప్రకారం, హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ ఫాంటసీ ఫిల్మ్ ‘అవతార్ 3 : ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఎంతో ఆసక్తికరమైన విషయమేమంటే, ‘అవతార్ 3’ స్క్రీనింగ్స్ సమయంలో ‘వారణాసి’ టీజర్‌ను థియేటర్లలో ప్రదర్శించేందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.



భారతదేశంతో పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన దేశాలలో ‘అవతార్ 3’ ఇంటర్వెల్ సమయంలో ‘వారణాసి’ టీజర్ చూపించనున్నారని సమాచారం. ఈ అరుదైన సహకారం సాధ్యపడటానికి రాజమౌళి – జేమ్స్ కామెరూన్ మధ్య ఉన్న మంచి వ్యక్తిగత సంబంధాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ‘RRR’ సినిమా గ్లోబల్‌గా సంచలన విజయాన్ని సాధించిన తరువాత, జేమ్స్ కామెరూన్ స్వయంగా రాజమౌళిని కలుసుకుని ప్రశంసించిన విషయం తెలిసిందే. అప్పుడు కామెరూన్ చెప్పిన ‘‘మీరు భవిష్యత్తులో చేసే సినిమాలు తప్పకుండా ప్రపంచం చూడాల్సిందే’’ అన్న మాటలు ఇప్పుడు ‘వారణాసి’ ప్రమోషన్ల రూపంలో నిజమవుతున్నట్లు సినీ పరిశీలకులు భావిస్తున్నారు.



ఇలా చూస్తే, ‘వారణాసి’ కేవలం భారత సినిమాలోపే కాదు, ప్రపంచ సినీ పరిశ్రమకు కూడా ఒక ప్రత్యేక అనుభవంగా రాబోతుందని చెప్పడానికి సందేహమే లేదు. అభిమానులు ఇప్పటినుంచే ఈ విజువల్ ఎపిక్ కోసం భారీగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: