అఖండ 2: నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్స్ సమావేశం.. రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారా..?
ఈ విషయం అటు అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురిచేసింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ పైన పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా థియేట్రీకల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోవడంతో నిర్మాతలకు అడ్వాన్సులు భారీగానే అందాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ మాత్రం ఈరోస్ నౌ సంస్థకు చేయకపోవడంతో సినిమా విడుదల ఆగిపోయింది. తాజాగా ఫైనాన్స్ ఇష్యూ క్లియర్ పూర్తి అయ్యిందని రిలీజ్ డేట్ కోసం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈనెల 12వ తేదీన లేదా 25వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. తాజాగా నిర్మాతలతో రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈరోజు హైదరాబాదులో భేటీ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమా కోసం తాము బయట వడ్డీకి డబ్బులు తీసుకువచ్చామని వారి నుంచి మాకు ఒత్తిడి ఉంది, ఎంత త్వరగా విడుదల చేస్తే అంత మంచిదంటూ వినిపిస్తున్నారు. వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు దాదాపుగా ఓకే అన్నట్లుగా వినిపిస్తున్నాయి. కానీ ఈ తేదీని అటు బెంగళూరు డిస్ట్రిబ్యూటర్స్, ఓవర్సీస్ అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. అటు నిర్మాతలు ,ఇటు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య జరుగుతున్న ఈ చర్చలు సాయంత్రంలోపు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయట.