పెద్ది వ‌ర్సెస్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ... క్లాష్‌లో కొత్త ట్విస్ట్ చూశారా... ?

RAMAKRISHNA S.S.
టాలీవుడ్‌లో ప్రతి పెద్ద హీరో సినిమా విడుదల తేదీ పెద్ద సంచలనమే. తాజాగా విడుదల తేదీల విషయంలో చర్చకు వస్తున్న రెండు సినిమాలు రామ్‌చ‌ర‌ణ్‌ నటిస్తున్న ‘పెద్ది’, మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ రెండు సినిమాలు సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల అయ్యే అవకాశాలపై మీడియా వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాల మధ్య క్లాష్ జరుగుతుందా ? అనే చర్చ మొదలైంది. కానీ తాజా సమాచారం ప్రకారం, అలాంటి క్లాష్‌కు అవకాశమే లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే రామ్‌చ‌ర‌ణ్ స‌రికొత్త‌గా ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ, ఊరమాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చే దశలో ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రావాలన్నది మేకర్స్ అభిప్రాయం.


ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయానికి వస్తే, ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ పరంగా నిలిచిపోయింది. పవన్ రాజకీయ రంగంలో బిజీగా ఉండటంతో, రెగ్యులర్ షెడ్యూల్స్ ఆల‌స్యం అయ్యాయి. దీంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నా, పవన్ డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్ల సినిమా త్వరగా ముందుకెళ్లడం లేదు. అంతేకాకుండా సినిమా నిర్మాణం బాగా ఆల‌స్యం కావ‌డంతో సంక్రాంతి ఆశ‌లు చెదిరిపోయాయి. దీంతో, ‘పెద్ది’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల మధ్య రిలీజ్ క్లాష్ అనే దాంట్లో నిజం లేదని తెలుస్తోంది.


టాలీవుడ్‌లో పెద్ద సినిమాల మధ్య క్లాష్ జరిగినప్పుడు, మిడిల్ రేంజ్ సినిమాలు, థియేటర్ షేర్‌కి పెద్ద సమస్యలు వస్తుంటాయి. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి తప్పే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే రెండు సినిమాలు ఒకే టైమ్‌కి రావడం లేదు అన్నది ఇప్పుడు స్పష్టమైంది. ఫైన‌ల్‌గా ‘పెద్ది’ వ‌ర్సెస్‌ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మధ్య రిలీజ్ పోటీ జరిగే అవకాశాలు శూన్యం. పెద్ది ముందు రిలీజ్ అయితే.. ఉస్తాద్‌కు కాస్త టైం ప‌ట్టే ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: