విశ్వంభరను మెగా క్రాస్ చేసిన బాలయ్య అఖండ 2 ..!
టాలీవుడ్ సీనియర్ హీరో , నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “ అఖండ 2 తాండవం ” బాలయ్య కెరీర్ లోనే నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకొని ఈ సినిమా రిలీజ్ కి ముందు వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్ కు ముందు భారీ హైప్ , అంచనాలు సెట్ చేసుకుని చిట్టచివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక అఖండ 2 - తాండవం కొత్త డేట్ కోసం అందరూ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఆగినా సినిమా కోసం ఎదురు చూసే వాళ్లు .. సినిమా పై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.
అఖండ 2 రిలీజ్ కు ముందు ప్రముఖ టిక్కెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఇంట్రెస్ట్స్ దాదాపు 2 లక్షల దగ్గరలో ఉండేవి కానీ వాయిదా పడిన తర్వాత క్రేజ్ అనూహ్యంగా మరింత లెవెల్లో పెరిగింది. కేవలం ఈ రెండు రోజుల్లోనే అదనంగా మరో లక్ష మంది సినిమాపై ఇంట్రెస్ట్ చూపించడాన్ని బట్టి చూస్తే ఈ సినిమా పై క్రేజ్ , ఆసక్తి ఏ రేంజ్‌లో ఉందో క్లీయర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం బుక్ మై షోలో అఖండ 2 కి 3 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ నమోదు అయ్యాయి. ఇప్పుడు మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలయ్య ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. బాలయ్య నటిస్తోన్న సినిమాలు వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. ఈ టైంలో వచ్చిన అఖండ 2 తాండవం వాయిదా పడడం అభిమానులు అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇక అఖండ పరిస్థితి ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన “ విశ్వంభర ” పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు కానీ ఈ సినిమాకి ఆల్రెడీ 2 లక్షలకి పైగా ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. దానిని అఖండ 2 ఇపుడు క్రాస్ చేసింది. ఫ్యూచర్ లో దీనిని విశ్వంభర క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక విశ్వంభర వచ్చే యేడాది సమ్మర్ రిలీజ్ అంటూ లీకులు ఇస్తున్నారు.