బిగ్ బాస్9:తనూజని చిత్రహింసలు పెడుతున్న నాగార్జున.. అలా జరగడం ఇష్టం లేదా.?

Pandrala Sravanthi
బిగ్ బాస్ సీజన్ 9 లో అలా జరుగుతుందా.. బిగ్ బాస్ యూనిట్, నాగార్జున ఆ విధంగానే ఆలోచిస్తున్నారా.. అందుకే తనూజని అన్ని చిత్రహింసలు పెడుతున్నారా.. హౌస్ లోకి వచ్చిన కొత్తలో రెండు మూడు వారాలు బిగ్ బాస్ ముద్దుబిడ్డగా పిలిచినా తనూజని ప్రస్తుతం బిగ్ బాస్ ఎందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఎందుకు నాగార్జున తనూజను టార్గెట్ చేస్తున్నారు అని ప్రతి ఒక్క నెటిజెన్ సోషల్ మీడియాలో బిగ్ బాస్ ని, నాగార్జునని ఉద్దేశించి కామెంట్ల మోత మోగిస్తున్నారు.ఒకప్పుడు తనూజ ఏం చేసినా సూపర్,ఎక్స్ట్రార్డినరీ అని పొగిడే బిగ్ బాస్ యూనిట్,నాగార్జున ఇప్పుడు తనూజ ఏం చేసినా తప్పే అన్నట్లుగా చూస్తున్నారు.దాంతో తనూజ అభిమానులకు కూడా అసలు ఆమె ఏం చేసినా తప్పేనా.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఒక లేడీ కంటెస్టెంట్ ని అంతలా టార్గెట్ చేయడం అవసరమా అంటూ మాట్లాడుకుంటున్నారు. 


అయితే సీజన్ 7 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని విన్ చేయడం కోసం అమర్ ని ఎలా బలి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది అంటున్నారు కొంతమంది నెటిజన్లు.. ఎందుకంటే సీజన్ 9 లో ఆర్మీ నుండి వచ్చిన కళ్యాణ్ పడాలనే విన్నర్ ని చేయడం కోసం మిగతా సెలబ్రిటీల అందరిని పావులుగా వాడుకుంటున్నారని అంటున్నారు. ఒకప్పుడు తనూజని బిగ్ బాస్ ముద్దుబిడ్డ అని తనూజనే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అని తేల్చేశారు.కానీ ఇప్పుడు టాక్ మారిపోయింది. ఎక్కడ చూసిన బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలా అని మార్మోగిపోతుంది. అయితే కళ్యాణ్ ని విన్నర్ చేయడం కోసం తనూజని టార్గెట్ చేసి మరీ విమర్శిస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.


అంతేకాదు కావాలనే నాగార్జున బిగ్ బాస్ టీం తనూజని ముప్పు తిప్పలు పెడుతున్నారని, ఆమె ఏం చేసినా సరే నెగటివ్గా చూపిస్తున్నారని అంటున్నారు. అయితే తనూజ,ఇమ్మానియేల్, కళ్యాణ్ ఈ ముగ్గురి మధ్యే టఫ్ ఫైట్ నడుస్తోంది. టైటిల్ విన్ అయితే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు విన్ అవ్వాలి. ఒకవేళ తనూజ విన్ అవుతే మాత్రం లేడీ ఇప్పడి వరకు ఎవరు అందుకోని కప్పు అందుకొని  చరిత్ర క్రియేట్ చేస్తుంది. అయితే గతంలో అంటే బిగ్ బాస్ ఓటిటి సీజన్లో బిందు మాధవి కప్ విన్నర్ అయినప్పటికీ అది ఓటిటి సీజన్.. అందుకే చాలామంది ఈసారి కప్పు తనూజదే అనుకున్నారు. లేడి కంటెస్టెంట్ కే కప్పు ఇస్తారనుకున్నారు. కానీ సడన్గా బిగ్ బాస్ యూనిట్ మనసు మార్చుకొని ఆర్మీ నుండి వచ్చిన కళ్యాణ్ పడాలకి టైటిల్ ఇస్తే బిగ్ బాస్ పై క్రేజ్ మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: