అఖండ 2 వాయిదా.. ఆ సినిమాలన్నీ గందరగోళంలో పడ్డాయ్...?
టాలీవుడ్‌లో చిన్న సినిమాలు ఒక్కరోజు ఆలస్యం అయినా, అది వాళ్ల బడ్జెట్‌కి భారీ నష్టం. ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బు తిరిగి రావాలంటే, థియేటర్లలో కనీసం ఒక వారం స్టేబుల్‌గా సినిమా ఆడాలి. కానీ ‘అఖండ 2’ ఎప్పుడైనా సడెన్‌గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చిన్న సినిమాలను థియేటర్లలో తీసుకునేందుకు ముందుకు రావడంలేదు. ఎందుకంటే ఒకవేళ ‘అఖండ 2’ తక్షణమే రిలీజైతే, వాళ్లకు అప్పటికే పెట్టిన డబ్బు పోతుందన్న భయం వారిలో ఉంది. అందుకే చాలా చిన్న సినిమాలు ‘అఖండ 2’ రిలీజ్ డేట్ క్లారిటీ కోసం వేచి చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, కొన్ని చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాలను జనవరి లేదా ఫిబ్రవరి కి మారుస్తున్నట్టు సమాచారం. కానీ అంతవరకు ప్రచారం చేయలేని పరిస్థితి, మార్కెట్‌కి చేరుకోలేని సమస్యలు వర్ణించలేనివి. ఓవైపు పెద్ద సినిమాల అనిశ్చితి, మరోవైపు ఆర్థికంగా ఎదురయ్యే ఒత్తిళ్లు , చిన్న సినిమాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకవేళ ‘ అఖండ 2 ’ విడుదల తేదీపై స్పష్టత వచ్చి, అది వచ్చే వారం కాని, నెల చివరలో కాని అని ఖరారైతే, చిన్న సినిమాలకు మార్గం తేలిపోయినట్లే. కానీ ఎప్పుడైనా సడెన్‌గా వచ్చేస్తే, చిన్న సినిమాలకు ఎటూ పోనిలా చిక్కుపడే పరిస్థితి. మొత్తంగా చూస్తే, బాలయ్య సినిమాకు ఉన్న మాస్ క్రేజ్, మార్కెట్ డామినేషన్ వల్ల చిన్న సినిమాలు వాటి భవిష్యత్తు నిర్ణయించుకోలేని దశకి చేరుకున్నాయి. అందుకే ఇప్పుడు మొత్తం చిన్న చిత్ర పరిశ్రమ ‘అఖండ 2’ తుది విడుదల తేదీ కోసం వేచి చూస్తోంది. అఖండ 2 రిలీజ్ డేట్ వచ్చాకే తమ సినిమాలు రిలీజ్ డేట్ల విషయంలో ఓ క్లారిటీకి రానున్నాయి.