సంక్రాంతి సినిమాల జోష్ మొదలైంది.. వాటితో మంచి ఇంపాక్ట్ కొట్టేశారుగా..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి పండక్కు మన తెలుగు సినిమాలు అనేకం విడుదల కాపటానికి రెడీగా ఉన్నాయి. ఇక ఇప్పటికే సంక్రాంతి సినిమాలకు సంబంధించిన సందడి కూడా మొదలైంది. ఈ సారి సంక్రాంతి పండగ సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ , మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు , మాస్ మజారాజ రవితేజ హీరో గా రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి , నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలు విడుదల కాపడానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే ఈ మూవీ లను సంక్రాంతి పండక్కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల కావడానికి రెడీ అయిన ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయ్యాయి.


ఇక ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన పాటలను కూడా ఇప్పటికే మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ లలో రాజా సాబ్ మూవీ కి సంబంధించిన ఒక పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక మన శంకర వర ప్రసాద్ గారు నుండి ఇప్పటికే మేకర్స్ 2 పాటలను విడుదల చేయగా ఆ రెండు పాటలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుండి నుండి ఒక పాటను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. అనగనగా ఒక రాజు మూవీ నుండి మేకర్స్ ఒక పాటను విడుదల చేయగా అది ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలా ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: