అందరి అంచనాలను తారుమారు చేస్తున్న రవితేజ.. ఇది మామూలు స్పీడ్ కాదుగా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఆశిక రంగనాథ్ , డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... బీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క షూటింగ్ను కొంత కాలం క్రితమే ప్రారంభించారు. ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్ ఆయిన సమయానికి సంక్రాంతి పండక్కు మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉండడంతో చాలా మంది ఈ సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని సంక్రాంతి సమయం వరకు పూర్తి కావడం కష్టం. ఈ మూవీ సంక్రాంతి కి విడుదల కావడం కష్టం అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేశారు. కానీ కిషోర్ తిరుమల మాత్రం ఈ సినిమా యొక్క షూటింగ్ ను జెట్ జడ్పీలో కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు.
 


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు , మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ కాబోతున్నట్లు , ఈ మూవీ కచ్చితంగా సంక్రాంతి పండక్కు విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం వారు ప్రమోషన్ల విషయంలో కూడా అత్యంత స్పీడులో దూసుకుపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఒక సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇక తాజాగా మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి అద్దం ముందు అంటూ సాగే సాంగ్కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు , ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt

సంబంధిత వార్తలు: