రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ మూవీని ప్రమోట్ చేయడం కోసం జపాన్ పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.జపాన్లో ఇప్పటికే బాహుబలి చాలాసార్లు విడుదలైంది. కానీ ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో బాహుబలి సినిమాను కూడా రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా వచ్చింది. కాబట్టి బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్2 రెండూ కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు.అయితే బాహుబలి ది ఎపిక్ ని కేవలం ఇక్కడే కాకుండా జపాన్లో కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తుంది.
ఈ సినిమాని జపాన్ లో డిసెంబర్ 12న విడుదల చేయబోతోంది. అయితే ఈ సినిమా జపాన్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మొత్తం జపాన్ లో బాహుబలి ది ఎపిక్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది అభిమానులు ప్రభాస్ ఆరోగ్యం గురించి భయపడిపోతున్నారు. దానికి ప్రధాన కారణం జపాన్లో తాజాగా భారీ భూకపం సంభవించడమే.జపాన్లో భూకంపాలు రావడం తరచుగా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జపాన్ లో భారీ భూకంపం రావడంతో ప్రభాస్ అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు.
దీంతో ప్రభాస్ కి ఏమైందో ఏమోనని తెగ గాబరా పడిపోయారు.కానీ తాజాగా డైరెక్టర్ మారుతి ప్రభాస్ ఆరోగ్యం గురించి వస్తున్న అవాస్తవాలు నమ్మకండి.. ప్రభాస్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు ఏమీ కాలేదు క్షేమంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు పట్టించుకోకండి.. ఈరోజే నేను ప్రభాస్ తో మాట్లాడాను ఆయన సురక్షితంగా ఉన్నానని చెప్పారు అంటూ డైరెక్టర్ మారుతి ప్రభాస్ అభిమానులకి ఊరట కలిగించే న్యూస్ చెప్పారు.దీంతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.