ఆ హీరోయిన్ మీద కోపంతోనే నరసింహలో లేడి విలన్.. రజినీకాంత్ గుట్టు రట్టు చేసిన డైరెక్టర్.!

Pandrala Sravanthi
ఏంటి నరసింహ సినిమాలో లేడీవిలన్ ని పెట్టడానికి కారణం రజినీకాంత్ కి ఆ హీరోయిన్ మీద ఉన్న కోపమేనా..ఆ హీరోయిన్ మీద కోపంతోనే రజినీకాంత్ తన సినిమాలో లేడీ విలన్ ని పెట్టుకున్నారా.. దర్శకుడు చెప్పిన ఆ నిజాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రజినీకాంత్ బర్త్డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పడయప్ప అంటే తెలుగులో విడుదలైన నరసింహ మూవీ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా  రీ రిలీజ్ మాత్రమే కాకుండా నీలంబరి పేరుతో సీక్వెల్ కూడా తీస్తామని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ ఈ సినిమా స్టోరీ గురించి రజినీకాంత్ చేసిన పని గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు  డైరెక్టర్.కే.ఎస్. రవికుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మొదట అనుకున్న కథ వేరు. 


ఇందులో ఒక హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించినట్లు నేను పెట్టాను. కానీ కథలో మెయిన్ విలన్ గా లేడీ విలన్ ని మాత్రం అనుకోలేదు.కానీ స్టోరీ మొత్తం రజినీకాంత్ గారు మార్చేసి ఆయనకు తగ్గట్లు పెట్టేశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఓకే కానీ ఒక హీరోయిన్ ప్రేమ వల్ల విలన్ గా తయారవుతుంది. అలా హీరో హీరోయిన్ మధ్య గొడవకి కారణం ప్రేమే అవుతుంది.అలా ఒక పవర్ఫుల్ లేడీ విలన్ ని తీసుకుందాం అని రజినీకాంత్ స్టోరీ మొత్తం మార్చేశారు. మొదట ఈ సినిమాకి హర అనే పేరుని అనుకొని లేడీ వీలన్ ని అనుకోలేదు.కానీ రజినీకాంత్ సినిమా మొత్తం మార్చేశారు.అలా పడయప్ప అనే టైటిల్ తో సినిమా స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా క్రెడిట్ మొత్తం రజినీకాంత్ గారికే ఇవ్వాలి అంటూ కే. ఎస్. రవికుమార్ చెప్పుకొచ్చారు.


ఇక రజినీకాంత్ మాట్లాడుతూ.. 1996లో నాకు జయలలితకి రాజకీయంగా అస్సలు పడేది కాదు. దాంతో నేను చేయబోయే పడయప్ప మూవీ లో లేడీ విలన్ ఉండబోతుందని తెలిసి చాలామంది ఆరోల్ జయలలితకి వ్యతిరేకంగానే రజినీకాంత్ పెట్టారు అని  విమర్శించారు.కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా విడుదలయ్యాక జయలలిత సినిమా చూసి బాగుంది అని ఫోన్ చేసి మరీ చెప్పింది అంటూ రజినీకాంత్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలోని రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర జయలలితదే అని చాలామంది భావించారట. ఇక ఈ సినిమా తెలుగులో కాకుండా తమిళంలో డిసెంబర్ 12న రీ రిలీజ్ కాబోతోంది.పడయప్ప  బాహుబలి రీ రిలీజ్ రికార్డ్ లని కొల్లగొడుతుందని తమిళ ప్రేక్షకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: