ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఎవరో ఒక లవ్ జంట ఉంటుంది.అలా తెలుగులో ఇప్పటివరకు ప్రసారమైన ప్రతి ఒక్క సీజన్లో ప్రేమ జంటలు ఉన్నాయి. అలా దీప్తి సునయన తనీష్, రాహుల్ పునర్నవి, నిఖిల్ యష్మీ గౌడ, విష్ణు ప్రియ పృథ్వీ, అఖిల్ మోనాల్..ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు హౌస్ లో ప్రేమాయణం నడిపించారు. అయితే హౌస్ లో తమ మధ్య లవ్ ఉన్నట్టు కనిపించినప్పటికీ బయటికి వచ్చాక మాత్రం మా మధ్య ఏమి లేదు..జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అన్నారు.ఇక ఇప్పటివరకు ఇన్ని సీజన్లలో ఎంతోమంది ప్రేమ జంటలు బిగ్ బాస్ హౌస్ లో కనిపించాయి.కానీ బయటికి వచ్చాక ఒక్కరు కూడా పెళ్లి చేసుకుంది లేదు.అలా తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా రీతూ చౌదరి డిమాన్ పవన్ లు ఇద్దరు కూడా మొదటివారం నుండి చాలా సన్నిహితంగా మెదులుతూ ఒకరి కోసం ఒకరు నిలబడడమే కాకుండా తమ మధ్య లవ్ ఉన్నట్లు ప్రవర్తించారు.
కొంతమంది అయితే చాలా దారుణంగా వీరిపై కామెంట్లు పెట్టారు.ఎప్పుడు పడితే అప్పుడు పక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, నాకు నువ్వంటే ఇష్టం నీకు నేనంటే ఇష్టం అన్నట్లుగా మాట్లాడుకోవడం. పెళ్లి చేసుకోవాల్సి వస్తే నీలాంటి వాడినే భర్తగా చేసుకుంటాను అని రీతు చెప్పడం.. ఇలా ఎన్నో జరిగిపోయాయి.
అలా ఈ జంటని చూసి చాలామంది లవర్స్ అని అనడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కూడా చేశారు. ముఖ్యంగా వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా హౌస్ మేట్స్ మాట్లాడుకున్నారు. అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే డిమాన్ పవన్ హౌస్ లోకి రావడంతోనే రీతూకి కాకుండా తనూజకి గాలం వేశారంటూ ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే.. డిమాన్ ఇప్పుడు టాస్క్ పెడితే నేను ఒంటరి వాడిని అవుతాను. రీతూ ఉంటే నాకు సపోర్ట్ చేసేది అంటాడు. ఆ తర్వాత తనూజ ఎందుకురా అలా అనుకుంటావ్ ఇంకా రెండు వారాలే గా ఉంది అని అనగా..ఇమ్మానుయేల్ వచ్చి మీకు ఇద్దరికీ ఏంట్రా ప్రాబ్లం అని అడుగుతాడు. దాంతో డిమాన్ తనూజ నన్ను అర్థం చేసుకోదు అని చెప్పగా.. రీతూ ఉంటే అర్థం చేసుకునేదా అని ఇమ్మానుయేల్ అడగగా.. రీతు అన్ని అర్థం చేసుకుంటుంది.
హౌస్ లోకి వచ్చాక మొదట నేను తనూజకే కనెక్ట్ అయ్యేవాడిని.కానీ తనూజ మొదటి నుండి మూతి తిప్పేసుకునేది. అందుకే ఏదో తేడాగా ఉంది అని రీతూకి కనెక్ట్ అయ్యా అని డిమాన్ అసలు విషయాన్ని బయట పెడతాడు.దాంతో ఇమ్మానుయేల్ ఏంటి నువ్వు హౌస్ లోకి వచ్చాక మొదట తనూజకే గాలం వేయాలి అనుకున్నావా.. ఆమె నిన్ను దగ్గరికి రానివ్వకపోవడంతో రీతుకి కనెక్ట్ అయ్యావా అంటూ ప్రశ్నిస్తాడు. అలా ఏమీ లేదు నేను అందరితో క్లోజ్ గా ఉండాలి అనుకున్నాను.కానీ తనూజ కాస్త వేరేగా ఉండడంతో రీతూకి కనెక్ట్ అయ్యా అని చెబుతాడు.దీంతో ఇమ్మాన్యుయల్ ఆటపట్టిస్తూ రీతూ చూసావా నువ్వు వెళ్లిపోయావనే బాధ కొంచెం కూడా లేదు వీడు ఎంజాయ్ చేస్తున్నాడు అని చెబుతాడు. దాంతో వీరి సంభాషణ వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు డిమాన్ తనూజకే వలవేశాడు.కానీ ఆమె చిక్కకపోవడంతో రీతూని పడగొట్టాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.