అఖండ 2 ప్రీమియర్స్ కి ముందు బాలయ్య చేత అలాంటి పని.. బోయపాటి ఊర మాస్ స్కెచ్..!
ఇప్పటికే రిలీజ్ పోస్ట్‌పోన్ విషయంలో అనేక నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. వాటినన్నింటిని పూర్తిగా పాజిటివ్ వైపు మలిచేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ఓ సెన్సేషనల్ ప్లానింగ్ చేస్తున్నారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రీమియర్స్ కి కొన్ని గంటల ముందు స్వయంగా బాలయ్య చేత ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేయించేందుకు బోయపాటి సిద్ధపడినట్లు టాక్ వినిపిస్తోంది.ఆ వీడియోలో ఈ చిత్రం ఎందుకు డిసెంబర్ 5న రిలీజ్ కాలేకపోయింది? అసలు మధ్యలో ఏ సమస్యలు వచ్చాయి? సినిమా స్థాయి, స్కేల్ ఎంత భారీగా ఉందో? ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? అనే విషయాలను స్వయంగా బాలయ్య వాయిస్‌లో చెప్పిస్తూ, సినిమాపై నెగిటివ్ స్పెక్యులేషన్స్‌ని పూర్తిగా చక్కబెట్టాలనేది బోయపాటి ధ్యేయమని సోషల్ మీడియాలో బలంగా చర్చ జరుగుతోంది.
బాలయ్య ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఏ సినిమా రిలీజ్‌కు కూడా ఇలాంటి ప్రత్యేక క్లారిటీ వీడియో విడుదల చేసిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. ముఖ్యంగా రిలీజ్ కి కేవలం కొన్ని గంటల ముందు ఒక స్పెషల్ మెసేజ్ విడుదల చేయడం బాలయ్య లాంటి సీనియర్ హీరోకు చాలా కొత్త కాన్సెప్ట్.కానీ ‘అఖండ 2’ అంటే అభిమానుల్లో ఉన్న మాస్ క్రేజ్, సినిమాపై ఉన్న అంచనాలను బట్టి చూస్తే ఇలాంటి స్టెప్పులు కూడా ఈసారి నార్మల్‌గా పరిగణించవచ్చు. పైగా ‘అఖండ’ ఒక్క సినిమాతో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మరో స్థాయికి వెళ్లింది. అందుకే ఈ సీక్వెల్ పట్ల భారీగా ప్లానింగ్ చేస్తోందన్న మాట.
ఇక ఈ వీడియో విడుదల జరుగుతుంది అనే వార్త బయటకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో రేంజ్‌కి మించి హడావుడి మొదలైంది. కొన్ని నిమిషాల్లోనే పలు ఫ్యాన్ పేజీలు, ఇండస్ట్రీ గ్రూపులు ఈ టాపిక్‌ని వైరల్ చేశారు.అఖండ 2 పై ఎప్పటిలాగే బోయపాటి మాస్ ప్లానింగ్, బాలయ్య పవర్‌ఫుల్ ఇంటెన్సిటీ మరోసారి ప్రేక్షకులని ఊపేయడం ఖాయం. ప్రీమియర్స్ కి ముందు ఇలాంటి క్లారిటీ రివీల్స్ ఇవ్వడం సినిమాపై ఉన్న నెగిటివ్ డౌట్స్‌ని పూర్తిగా తుడిచేయవచ్చనే ఆశాభావం బాలయ్య ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.డిసెంబర్ 12న సినిమా థియేటర్లలో విడుదల అవుతుండగా, ఈసారి కూడా బాలయ్య మాస్ ఫుల్ పవర్‌ను రెట్టింపు చేయనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.