నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ విడుదలకు ముందు రోజు అయినటువంటి డిసెంబర్ 4 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ మూవీ ప్రీమియర్ షో లకు మరియు రెగ్యులర్ షో లకు సంబంధించిన టికెట్ బుకింగ్లను కూడా చాలా ప్రాంతాలలో ఓపెన్ చేశారు. అంతా ఓకే అయ్యి సినిమా విడుదల సమయం అత్యంత దగ్గర పడిన సమయం లో ఈ సినిమా విడుదల కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఈ సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత ఈ మూవీ ని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఆసక్తి చాలా మంది జనాల్లో నెలకొంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు , ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 11 వ తేదీన ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. ఇకపోతే డిసెంబర్ 19 వ తేదీన అవతార్ ఫైర్ ఆడ్ యాష్ మూవీ ని విడుదల చేయనున్నారు. దానితో అఖండ 2 మూవీ కి మంచి టాక్ వచ్చినా కూడా ఓవర్సీస్ లో ఈ మూవీ కి అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ ద్వారా లాంగ్ రన్ లో కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి అఖండ 2 మూవీ ఓవర్సీస్ లో ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసులు చేసి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.