త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి క్లాసికల్ టైటిల్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
ఇ ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తున్నారు. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి వంటి చిత్రాలు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాబోతోందని తెలిసి ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. వెంకటేష్ కి జోడిగా ఇందులో శ్రీనిధి శెట్టి తీసుకోబోతున్నట్లు వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న వెంకటేష్ రూ. 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరారు. అలాగే చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. హరి వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకి సంబంధించి నటీనటుల విషయంపై చిత్ర బృందం అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.