సమంత రూట్లోనే మరో స్టార్ బ్యూటీ.. భార్యని వదిలేసిన డైరెక్టర్ తో రెండో పెళ్లి..!?

Thota Jaya Madhuri
టాలీవుడ్ అందాల తార సమంత రెండో పెళ్లి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, విడాకుల తరువాత సుమారు నాలుగేళ్లపాటు ఒంటరిగా జీవించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవధిలో ఆమె కెరీర్‌పై దృష్టి పెడుతూ, ప్రయాణాలు చేస్తూ, నవ్యమైన జీవన శైలిని అవలంబిస్తూ ముందుకు సాగింది. ఇక ఇటీవల సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో ఆమె పెళ్లి విషయమై పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన కోయంబత్తూరు లోని ఈషా ఫౌండేషన్‌లో  వివాహం చేసుకున్న పిస్క్ ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. వీళ్ళు భూతశుద్ధి విధానంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి అత్యంత వ్యక్తిగతంగా, పరిమిత వ్యక్తుల సమక్షంలో జరిగింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం నెటిజన్లను మరోసారి చర్చల్లోకి నెట్టాయి.



సమంత రెండో వివాహం వార్త కాస్త దిగదుడుపు కావడంతోనే మరో స్టార్ సెలబ్రిటి పేరు ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరింది.అదే రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్. ధనుష్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఐశ్వర్య తన జీవితాన్ని పూర్తిగా కొత్తదిశగా మార్చుకుంటూ, సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉంటూ ముందుకు సాగుతుంది. కోలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమె ఒక ప్రముఖ సీనియర్ డైరెక్టర్‌(ఆల్ రెడీ విడాకులు తీసుకున్న)తో వివాహం చేసుకోనున్నారన్న వార్త దుమారం రేపుతోంది. నిజనిజాలు బయటకు రాకపోయినప్పటికీ కొన్ని వార్తా పేజీలు, సోషల్ మీడియా అకౌంట్లు ఈ విషయాన్ని ఆసక్తికరంగా చర్చిస్తున్నాయి.


కొంతమంది ఇది కేవలం గాసిప్ మాత్రమేనని భావిస్తే, మరోవైపు కొందరు “ఇలా జరుగడంలో ఆశ్చర్యపోనవసరం లేదు” అనే టాక్ పంచుకుంటున్నారు. ధనుష్ మరియు ఐశ్వర్య విడిపోయినప్పటికీ, కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలకు న్యాయం చేయాలనే విషయంలో ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకొని ముందుకు సాగుతున్నారని ఇండస్ట్రీ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ మధ్య ఇద్దరినీ మళ్లీ కలపడానికి పలువురు పెద్ద వ్యక్తులు సైలెంట్‌గా ప్రయత్నించారనే మాటలు కూడా అప్పుడప్పుడు వినిపించాయి. ప్రస్తుతం “ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి”, “సమంత రెండో వివాహం”, “కోలీవుడ్ గాసిప్స్” అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతుండటంతో నెటిజన్లు ఈ రెండు విషయాలపై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.సమంత కూడా వివాహం చేసుకున్నింది..ఐశ్వర్య ఎవ్వరిని పెళ్లి చేసుకోబోతుంది? అనే ప్రశ్నలకు ఇంకా అధికారిక సమాధానం రాకపోవడంతో సోషల్ మీడియా రూమర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: