మరోసారి బాలయ్యతో శ్రీలీల ఈసారి దర్శకుడు ఎవరో తెలుసా?
ఈ సినిమాతో ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు చాలా ఎక్కువ. అందుకే బాలయ్య – శ్రీలీల కాంబినేషన్లో మరో సినిమా వస్తుందా? అన్న ప్రశ్న ఒకరకంగా పరిశ్రమలో, సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ తరువాత అలాంటి ప్రాజెక్ట్‌లు ఆసక్తికరంగా వినిపించినప్పటికీ, నిజంగా ఏమీ ఫిక్స్ కాలేదు.కానీ తాజాగా లభించిన సమాచారం ప్రకారం, ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ సెట్ అయినట్టు తెలుస్తోంది. ఇది కూడా చిన్న మినీ రోల్ కాదు! నిజానికి గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలయ్య ప్రస్తుతం చేస్తున్న కొత్త చిత్రంలో శ్రీలీల ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. కానీ సినిమాకి సంబంధించిన మరో ముఖ్యమైన మహిళా పాత్ర కోసం గోపీచంద్ మల్లినేని స్వయంగా శ్రీలీలను రెఫర్ చేశారట. ఈ పాత్ర కథలో చాలా ప్రాధాన్యత ఉన్నందున, శ్రీలీలను తీసుకుంటే సినిమా రేంజ్ ఇన్నో లెవల్స్ పెరుగుతుందనే నమ్మకం టీమ్‌లో ఉందని సమాచారం.దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాలయ్య–శ్రీలీల కాంబినేషన్ మరోసారి స్క్రీన్‌పై సందడి చేయబోతోంది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘భగవంత్ కేసరి’లో చూసిన భావోద్వేగమేనా? లేక ఈసారి పూర్తిగా కమర్షియల్ యాక్షన్ కోణంలోనూ చూడబోతున్నామా? అన్న ఉత్కంఠ కూడా ఇవాళ్టి టాలీవుడ్ వర్గాల్లో కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే, బాలయ్య–గోపీచంద్ మల్లినేని కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, అందులో శ్రీలీల కాస్టింగ్ అంటే మరింతగా హైప్ పెరిగిందని చెప్పాలి. అభిమానుల మాటల్లో చెప్పాలంటే – ఈసారి కూడా “దుమ్ము రేపే కాంబినేషన్” రాబోతోందన్నమాట!