ఓరి మీ దుంపల్ తెగ..అఖండ 2 ను మళ్ళీ కావాలని అడ్డుకోవాలని చూస్తున్నారా..?
అఖండ 2 పై ఇండస్ట్రీ స్థాయిలోనే భారీ బజ్ నెలకొనగా, సినిమా థియేటర్లో విడుదలవడానికి కేవలం కొన్ని గంటల ముందు వరకు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఒక్కసారిగా షాక్‌లా మారిపోయింది. సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయని మీడియా ద్వారా తెలిసిన వెంటనే నందమూరి అభిమానుల మనసులు ముక్కలయ్యాయి.ఇదే కాకుండా రాత్రికి రాత్రే సినిమా విడుదల కూడా వాయిదా పడటంతో అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో వినిపించాయి. కొంతమంది టెక్నికల్ సమస్యలు వచ్చాయని చెబితే, మరికొందరు ఫైనాన్షియల్ లావాదేవీల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రచారం చేశారు. ఏది నిజమో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇంత హంగామా జరుగుతున్న తరుణంలో, ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగి సినిమా విడుదలకు సిద్ధమవుతుందనగా, మళ్లీ సోషల్ మీడియాలో అఖండ–2ను టార్గెట్ చేసే నెగిటివ్ ట్రోలింగ్ మొదలైంది. సినిమా అనుకున్నంత హిట్ అవ్వదని, సినిమాపై ఇంటరెస్ట్ తగ్గిపోయిందని కావాలనే విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.దీంతో నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల దగ్గర కూడా ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తుంది. “అఖండ 2ని కావాలనే అడ్డుకోవాలని చూస్తున్నారా?” ప్రస్తుతం ఇదే ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా చూసి బాలయ్య ఫ్యాన్స్ కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు—ఏ రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా, ఏ అడ్డంకులు వచ్చినా ఒక మాస్ సినిమా, ముఖ్యంగా బాలయ్య సినిమా ఆపలేరనే నమ్మకం.