వెంకీ సినిమా విషయంలో కూడా ఆ సెంటిమెంటును అస్సలు వదిలిపెట్టిన త్రివిక్రమ్..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తన తదుపరి మూవీ ని స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. తాజాగా వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబో మూవీ కి సంబంధించిన షూటింగ్ను ఈ రోజు మొదలు పెడుతున్నట్లు , ఈ మూవీ కి ఆదర్శ కుటుంబం అనే టైటిల్ను ఫిక్స్ చేస్తున్నట్లు , ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ను ఫిక్స్ చేయడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ , వెంకటేష్ సినిమా విషయం లో కూడా ఓ సెంటిమెంట్ను గట్టిగా ఫాలో అవుతున్నాడు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.


అసలు విషయం లోకి వెళితే ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాల టైటిల్స్ లలో మొదటి అక్షరం తో అ తో ప్రారంభం అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి , అ ఆ , అరవింద సమేత , అలా వైకుంఠపురంలో ఇలా చాలా సినిమాల టైటిల్స్ లో మొదటి అక్షరం "అ" తో ప్రారంభం అవుతుంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ , వెంకటేష్ తో  రూపొందిస్తున్న సినిమాకు కూడా మొదటి అక్షరం అ వచ్చేలా చూడడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ , వెంకటేష్ సినిమా విషయం లో కూడా టైటిల్ విషయంలో ఆయన పాత సినిమాల సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: