ఆ హీరోలంతా పొట్టోళ్లు.. కృతి సనన్ షాకింగ్ కామెంట్స్..!

Pandrala Sravanthi
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది..ఇక తాజాగా ధనుష్ తో కలిసి నటించిన తేరి ఇష్క్ మే అనే మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ హీరోలపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ హీరోలంతా పొట్టోళ్లు అని ఈ హీరోయిన్ మాట్లాడిన మాటలు చాలామంది ఆ హీరోల అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.ముఖ్యంగా ప్రభాస్, హృతిక్ రోషన్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ నా ముందు పొట్టోళ్లే అంటూ అవమానించేలా కృతి సనన్ మాట్లాడింది.


 అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ కి ఎత్తు గురించి ప్రశ్న ఎదురవగా.. అవును నా ఎత్తు చాలా ఎక్కువగా ఉంటుంది.అలాగే నేను చాలామంది హీరోలతో నటించిన సమయంలో ఆ హీరోలంతా హీల్స్ వేసుకునేవారు.నేను మాత్రం ఫ్లాట్ గా ఉండే చెప్పులు వేసుకునే వాడిని.వాళ్లంతా నాకంటే హైట్ తక్కువగా ఉంటారు. నేను నటించిన హీరోలలో ప్రభాస్,హృతిక్ రోషన్ మినహా మిగిలిన హీరోలంతా నా ముందు చాలా చిన్నగా ఉంటారు అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది.


అయితే కృతి సనన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది మహేష్ బాబు అభిమానులు ఆమె పై ఫైర్ అవుతున్నారు. ఏంటి ప్రభాస్, హృతిక్ రోషన్ తప్ప మిగిలిన హీరోలందరూ పొట్టిగానే ఉంటారా.. మరి మహేష్ బాబు  సంగతేంటి.. మహేష్ బాబు నీకంటే హైటే ఉంటారు కదా.. మహేష్ బాబు పేరు ఎందుకు ప్రస్తావించలేదు.. అంటే మహేష్ బాబు కూడా నీకంటే పొట్టిగానే ఉంటారా అంటూ ఏకిపారేస్తున్నారు. ఇక కృతి సనన్ తెలుగులో ప్రభాస్ తో ఆది పురుష్, నాగచైతన్యతో దోచేయ్, మహేష్ బాబు తో వన్ నేనొక్కడినే వంటి సినిమాలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: