తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
సూపర్ స్టార్ రజనీ కాంత్ చాలా సంవత్సరాల క్రితం పడియప్ప అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో
సౌందర్య ,
రమ్య కృష్ణ హీరోయిన్లుగా నటించగా ... కె ఎస్
రవి కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో
నరసింహ అనే పేరుతో విడుదల చేశారు. ఈ
మూవీ అటు
తమిళ్ , ఇటు తెలుగు బాక్సా ఫీస్ ల దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ
మూవీ లోని
రజినీ కాంత్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ
మూవీ లోని
సౌందర్య నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే
రమ్య కృష్ణ ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఈమె నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి రమ్య కృష్ణ కెరియర్లోనే ఈ
సినిమా లోని పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇకపోతే పడియప్ప
మూవీ ని మరి కొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు.
ఇక రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు
తమిళ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు రీ రిలీజ్ బుకింగ్స్ లో ఈ
మూవీ కి మొదటి రోజుకు గాను 25 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అని , ఈ
సినిమా రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.