అఖండ 2: సినిమాకే ఆ సీనే హైలెట్..!

Divya
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం అఖండ 2 తాండవం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. నిన్నటి రోజున రాత్రి ప్రీమియర్లు పడగా నేటి నుంచి షోలు మొదలయ్యాయి. థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల హంగామా నిన్నటి రోజు రాత్రి నుంచి మొదలయ్యింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ అయితే వినిపిస్తోంది. సినిమా చూసిన అభిమానులంతా కూడా అద్భుతంగా ఉందని హిందూ ధర్మం చుట్టూ కొనసాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.


ఇక ఈ సినిమాలో ఫస్ట్ అఫ్ పెద్దగా లేకపోయినా సెకండ్ ఆఫ్ మాత్రం అదిరిపోయిందని దైవం మీద పడిన నిందలను తొలగించడానికి హిందూ ధర్మం రక్షణ కోసం బాలయ్య చూపించిన తీరు హైలెట్ గా ఉందని చెబుతున్నారు. రాజకీయం, ఆర్మీ, దైవం, సెంటిమెంట్, చైనా బయోవార్ ఇలా అన్నీ కూడా కలిపి కథ రాసుకోవడం డైరెక్టర్ బోయపాటికే సాధ్యమని కామెంట్స్ చేస్తున్నారు..సెకండ్ ఆఫ్ మొదలయ్యాక ఆదిపినిశెట్టి తో అఘోరా క్యారెక్టర్ చేసే ఫైట్ సీను కూడా ఈ సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెంచేసిందని చెబుతున్నారు.


సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ బాలయ్య అభిమానులకు మంచి బూస్ట్ ఇస్తుందని చెబుతున్నారు. సెకండాఫ్ లో బాలయ్య 40 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించారు. బాలయ్య, బోయపాటి మాస్ ఫైట్లు కోరుకునే అభిమానులకు ఫుల్ ట్రీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ అందించిన బిజిఎం కూడా అదిరిపోయిందని, ప్రతి పాత్రలో కూడా బాలయ్య అదరగొట్టేసారని చెప్పవచ్చు. అఖండ మొదటి భాగంలో బాలయ్య నట విశ్వరూపం చూపించగా ఇప్పుడు రౌద్రరసంతో పాటు ఎమోషనల్ గా పాత్రలో లీనమైపోయి మరి నటించారు. మరి మొదటి రోజు అఖండ 2 ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: