అఖండ 2: బాలయ్య యాక్టింగ్ కి ఫిదా అవ్వాల్సిందేనా..?
అఖండ 2 సినిమా హై యాక్షన్ సన్నివేశాలతో అద్భుతమైన ఎమోషన్స్ సీన్స్ తో అలరిస్తోంది. ముఖ్యంగా కథ హిందూ ధర్మం చుట్టూ సాగుతుంది. అలాగే మదర్ సెంటిమెంట్ తో కూడా ఈ సినిమాని అద్భుతంగా చూపించారు బోయపాటి. బాలకృష్ణ విభిన్న గెటప్పులలో కనిపిస్తారు. బాలయ్య యాక్టింగ్ కి ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా నటించారు..బాలయ్య( అఖండ) పాత్రలో అద్భుతంగా నటించారు. తొలి పార్టీలోనే తన నట విశ్వరూపాన్ని చూపించిన బాలయ్య రౌద్రరసంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంటారు. ఇప్పుడు సీక్వెల్లో కూడా కొనసాగింపు పాత్రలలో లీనమయ్యారు బాలయ్య.
తల్లి చనిపోయినప్పుడు, పిల్లలతో సంభాషణలో బాలయ్య ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. అలాగే యాక్షన్లలో కూడా రౌద్రరసం పండించడంతో తనకు తానే సాటి అనిపించుకున్నారు బాలయ్య. బాలమురళికృష్ణ గా రెండవ పాత్ర పెద్దగా ప్రాధాన్యత లేదు. సంయుక్త మీనన్ పాత్ర కూడా మొదటి భాగంలోనే చంపేస్తారు. కేవలం జాజికాయ పాటతో పాటు నాలుగైదు సీన్లలో ఇమే పాత్రను ముగించేశారు. అఖండ పాత్రలో బాలయ్య అద్భుతంగా కనిపిస్తారు.. ఇందులో చెప్పే డైలాగులు కూడా అందరిని ఆకట్టుకుంటాయి. హర్షాలి మల్హోత్రా సినిమాకి కీలకమైన పాత్రలో నటించింది. విలన్ గా ఆది పినిశెట్టి నటించిన , బాలయ్య ముందు తేలిపోయారని కామెంట్స్ చేస్తున్నారు.