HBD: రజనీకాంత్ లైఫ్ లో అతి పెద్ద తప్పు అదేనట..!
బెంగళూరులో సాధారణ మరాఠీ కుటుంబంలో జన్మించిన శివాజీ రావ్ గైక్వాడ్(రజనీకాంత్).. బస్ కండక్టర్ గా పని చేస్తున్న సమయంలో తన స్టైల్ తో డైరెక్టర్ కే.బాలచందర్ కంట్లో పడ్డారు. 1975లో అపూర్వ రాగంగళ్ చిత్రం ద్వారా తన సిని కెరియర్ మొదలైంది. మొదట్లో విలన్ గా ,సహాయ పాత్రలలో నటించిన రజనీకాంత్. అంచలంచెలుగా ఎదిగి తమిళ సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు. రజనీకాంత్ తాగే సిగరెట్ స్టైల్, నడిచే స్టైల్, కళ్ళజోడు స్టైల్ అన్నీ కూడా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. రజనీకాంత్ కెరీర్ ని నరసింహ, ముత్తు, భాష వంటి చిత్రాలు దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి మరి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
రోబో, శివాజీ, కబాలి, జైలర్ వంటి సినిమాలు భారతీయ సినిమాఖ్యాతిని ప్రపంచ స్థాయికి చాటి చెప్పేలా చేశాయి. 75 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు సాధ్యం కానీ రికార్డులను సృష్టిస్తున్నారు రజనీకాంత్. రజనీకాంత్ జైలర్ సినిమా ఆడియో ఈవెంట్ లో తన మద్యం అలవాటుపైన తాను వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. తనకు ఆల్కహాల్ అలవాటు కాకుండా ఉంటే సమాజానికి తాను మరింత సేవ చేసే అవకాశం దొరికేదని, నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు మద్యానికి అలవాటు కావడమే.. మద్యాన్ని పూర్తిగా మానేయాలని తాను చెప్పడం లేదు.. కేవలం కొన్ని సందర్భాలలో వాటిని పరిమితిగా తాగండి! నిత్యం మద్యాన్ని సేవించడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ప్రమాదమే, మన కుటుంబ పరిస్థితులను కూడా ఆలోచించాలని అభిమానులకు సలహా ఇచ్చారు.