విజయ్ కి పర్సనల్ మేనేజర్ ఊహించని షాక్.. తడిగుడ్డతో గొంతు కోశాడుగా.!

Pandrala Sravanthi
తమిళ నటుడు విజయ్ రీసెంట్ గానే టీవీకే పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారో అప్పటినుండి చాలామంది యువత,ఆయన అభిమానులు వెన్నంటే ఉంటూ ఆయన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.అలాగే వచ్చే ఏడాది 2026 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయ్ టీవీకే పార్టీ ఘనవిజయం సాధిస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడులో బలంగా ఉన్న డీఎంకే పార్టీ కి అసలు సిసలైన గట్టి పోటీ ఇచ్చేది మా పార్టీనే అని విజయ్ ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీవీకే పార్టీకి సంబంధించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.కానీ ఈ అత్యవసర సమావేశానికి విజయ్ పర్సనల్ మేనేజర్ సెల్వకుమార్ హాజరు కాలేదు. 


ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ పెట్టారు. దాంతో  పని మీద బయటకు వెళ్ళాడులే మళ్ళీ వచ్చేస్తాడులే అనుకున్నారు. కానీ సడన్గా సెల్వకుమార్ విజయ్ కి అస్సలు ఊహించని షాక్ ఇచ్చారు. అదేంటంటే విజయ్ పర్సనల్ మేనేజర్ సెల్వకుమార్ టీవీకే పార్టీని వదిలేసి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకె పార్టీలో చేరారు. అయితే మొదట ఈ ఫోటో వైరల్ అవ్వడంతో చాలామంది నమ్మలేదు. కానీ స్వయంగా సెల్వ కుమార్ బయటికి వచ్చి నేను డీఎంకే పార్టీలో చేరాను అని క్లారిటీ ఇవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇక ఈ విషయంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ కి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు.


 అయితే తాను టీవీకే పార్టీని వదిలేసి డీఎంకే పార్టీలో చేరడానికి ప్రధాన కారణం బయట నుండి వచ్చిన నేతలకు గౌరవ మర్యాదలు ఇస్తూ ముందు నుండి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారిని అవమానిస్తున్నారని, అన్నాడీఎంకే పార్టీ నుండి చాలామంది టీవీకే పార్టీలోకి వచ్చారు.కానీ వారికి గౌరవ మర్యాదలు ఇస్తూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముందు నుండి పార్టీలో ఉన్న వారికి కనీస మర్యాదలు ఇవ్వకపోవడంతో పాటు బయట నుండి వచ్చిన వాళ్లే మాపై అజమాయిషి చలాయిస్తున్నారు. అందుకే ఆ పార్టీలో ఉండలేక డిఎంకె పార్టీకి వచ్చేసాను. అలాగే విజయ్ ని నమ్ముకున్న వారికి గౌరవ మర్యాదలు ఆ పార్టీలో కరువాయ్యాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయ్ పర్సనల్ మేనేజర్ సెల్వకుమార్. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: