ప్రభాస్ ఫ్యాన్స్ బాధను అర్థం చేసుకున్న సందీప్ రెడ్డివంగా..డార్లింగ్ కోసం ఆ బ్యూటీ..?
ఇలాంటి సమయంలో తాజాగా బయటకు వస్తున్న సమాచారం ప్రకారం—ఈ భారీ సినిమాలో ఒక ఇంపార్టెంట్, క్రిషియల్, కథను ముందుకు తీసుకువెళ్లే పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం సందీప్ రెడ్డి వంగా అనుష్క శెట్టిని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట.
ప్రభాస్ – అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరూ కలిసి నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, ప్రేక్షకులు వీరిని స్క్రీన్ మీద చూడడం అంటే ఓ ప్రత్యేక మేజిక్, ఓ ప్రత్యేక కెమిస్ట్రీ అనిపిస్తుంది. ఈ జంటపై ఫ్యాన్స్‌కి ఉన్న మమకారం మరెంత ఉందో “మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో” అని సోషల్ మీడియాలో తరచూ జరిగే డిస్కషన్లు చూస్తే అర్థమవుతుంది. ప్రత్యేకంగా రెండు వైపులా ఉన్న ఫ్యాన్స్ అయితే ఎప్పటినుంచో ఈ కాంబినేషన్ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. “ప్రభాస్ – అనుష్క పక్కపక్కన కనిపించే రోజు ఎప్పుడు వస్తుందా” అనే ఆతృత ఎంతోకాలంగా కొనసాగుతోంది. అలాంటి ఫ్యాన్స్ కోరికను తీర్చడానికి సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చాడని, స్పిరిట్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం స్వీటీని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా…“ఇది దాదాపు కన్ఫర్మ్గానే ఉంది"అని కొన్ని మీడియా హౌసెస్ చేస్తున్న రిపోర్ట్స్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్టులు మాత్రం ఈ వార్తకు మరింత బలాన్నిస్తున్నాయి.చూడాలి మరి…ప్రభాస్ – అనుష్క కలయికను మళ్లీ పెద్ద తెరపై చూపించే ఈ గుడ్ న్యూస్‌ను అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు ఫ్యాన్స్ ఆనందం ఎలాంటి స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడమే వేరే లెవల్ లో ఉంది.