తెలుగులో మరో జాక్పాట్ ఛాన్స్ కొట్టేసిన శ్రీనిధి ..ఈ సారి ఏకంగా పెద్ద తలకాయనే పట్టిందిరోయ్..!?

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హాట్ టాపిక్ బాగా వైరల్ అవుతోంది. టాలీవుడ్, శాండల్‌వుడ్ వర్గాల్లో అందరూ మాట్లాడుకుంటున్న పేరు శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సిరీస్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఒక్కసారిగా పాన్-ఇండియా లెవెల్‌లో టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. అయితే, కేజీఎఫ్ 1 & 2 తర్వాత కొంతకాలం సినిమాలకి కమిట్ చేయకుండా పెద్ద గ్యాప్ ఇచ్చిన కారణంగా సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా పెరిగింది. “శ్రీనిధి పేరు మర్చిపోయారు”, “ఆమె కెరీర్ అంతే అయిపోయిందా?” అంటూ రకరకాల వ్యాఖ్యలు వచ్చినప్పటికీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే, శ్రీనిధి శెట్టి మళ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. వరుసగా కొత్త అప్‌డేట్‌లు షేర్ చేస్తూ, కొత్త లుక్స్, ఫొటోలు రిలీజ్ చేస్తూ, మళ్లీ అభిమానులు, నెటిజన్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంది.


ఇక కెరీర్ విషయానికి వస్తే, శ్రీనిధి ప్రస్తుతం వరుస ఆఫర్లతో మరింత బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ఒక హిట్ సినిమా వచ్చిన తర్వాత ఆమె డిమాండ్ రేంజ్ మారిపోయినట్లు ఇండస్ట్రీ టాక్. త్రివిక్రమ్–వెంకటేష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో మరోసారి  ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.అంతే కాదు… ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో సెన్సేషనల్ వార్త ఏమిటంటే— సుకుమార్ – చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో రెండో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి ఫిక్స్ అయిపోయిందట.



సినిమాలో మొదటి హీరోయిన్ కృతి సనన్ ఇప్పటికే సెలెక్ట్ అయిపోయిందని, రెండో కీలక పాత్ర కోసం శ్రీనిధినే ఎంపిక చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో బాగా ప్రచారం జరుగుతోంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్‌కి మంచి స్కోప్, స్టైలిష్ ప్రెజెంటేషన్, బోల్డ్ మరియు ఇమోషనల్ పాయింట్స్ ఎక్కువగా ఉండటం తెలిసిందే. కావున ఈ అవకాశం శ్రీనిధి కెరీర్‌లో నిజంగా ఒక పెద్ద జాక్‌పాట్‌గా మారుతుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద, కొద్ది నెలల క్రితం వరకూ “శ్రీనిధి ఇక కనిపించట్లేదు” అని అనుకున్న నెటిజన్స్‌కు ఇప్పుడు ఆమె వరుస అప్‌డేట్లు, కొత్త సినిమాలు, భారీ ప్రాజెక్టులు అన్నీ పెద్ద సర్ప్రైజ్‌గా మారాయి. గ్యాప్ ఇచ్చినా, కేజీఎఫ్ బ్రాండ్ మరియు ఆమె ప్రతిభ ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులే ఆమె ఫ్యూచర్‌ను పూర్తిగా మార్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: