ప్రభాస్ ఎనర్జిటిక్ స్టైలిష్ మాస్ లుక్ తో సోషల్ మీడియాలో షేక్...!
ప్రభాస్ నుంచి మాస్ ఆడియన్స్ ఆశించేది.. పక్కా గ్లామర్, ఎలివేషన్, కామెడీ, యాక్షన్ కలయిక. మారుతి ఈ సినిమాలో ప్రభాస్‌ను పక్కా మాస్ కమర్షియల్ యాంగిల్‌లో చూపించబోతున్నారని ఈ ప్రమో ఫోటోలు రుజువు చేస్తున్నాయి.ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ది రాజా సాబ్’ ప్రమోషనల్ ఫోటోల్లో ప్రభాస్ లుక్ చాలా ఎనర్జిటిక్‌గా, స్టైలిష్‌గా ఉంది. ఈ ఫోటోలు సినిమాలోని మాస్ ఎలివేషన్, కామెడీ టైమింగ్‌ను సూచిస్తున్నాయి.
ఒక ఫోటోలో ప్రభాస్ తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో.. బోల్డ్, చార్మింగ్ లుక్‌తో కనిపించారు. ఈ లుక్ యూత్‌ను, మాస్ ఆడియన్స్‌ను ఇద్దరినీ ఆకట్టుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రమో ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలైన వెంటనే.. ప్రభాస్ అభిమానులు మాస్ పూనకాలతో ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ‘అన్ స్టాపబుల్’, ‘రెబల్ స్టార్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మారుతి ఈ సినిమా ద్వారా ప్రభాస్‌ను తన ఫ్యామిలీ కామెడీ, మాస్ యాక్షన్ జోన్‌లో చూపించి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రమో ఫోటోలు ఆ ప్లాన్‌కు తొలి మెట్టులా నిలిచాయి.‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన ఈ ప్రమోషనల్ గ్లింప్సెస్.. బాక్సాఫీస్‌పై ప్రభాస్ సృష్టించబోయే మాస్ విధ్వంసంకు ట్రైలర్‌లా నిలిచాయి!