అఖండ 1.. అఖండ 2 బోత్ ఆర్ నాట్ సేమ్ ..!
అఖండ 2 థియేటర్లలో తాండవం చేస్తోంది. సినిమా అంచనాలు అందుకుందా ? బాలయ్య వరుసగా ఐదో హిట్ కొట్టాడా ? అంటే ఫస్ట్ వీకెండ్ వరకు ఆగితే కాని చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే అఖండ 1కు, అఖండ 2 కు మధ్య కంపేరిజన్ వస్తోంది. ఈ రెండు సినిమాలలో ఏది బాగుంది అనే దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అఖండ 2 లో 1లో ఉన్నంత స్టోరీ డెప్త్, ఎమోషన్ లేదు. అఖండ 2 లో తల్లి చనిపోయిందని పాప చెపుతున్నప్పుడు నీకెలాంటి బంధాలు లేకపోయినా ఆమెకు ఆ బంధం ఉంటుంది కదా ? అన్నప్పుడు, జనం చస్తున్నా నీ దేవుడు రాడు.. తల్లి చనిపోయినా నువ్వు రావు.. అసలు నీకు , నీ దేవుడికి మనసు అనేది ఉందా ? అనే డైలాగులు చెపుతున్నప్పుడు తల్లి బంధం, తల్లి పట్లప్రతి ఒక్కరికి ఉండే ఎమోషన్‌ను మనస్సును కదిలిస్తాయి.
నటీనటుల్లో బాలయ్య అఖండ పాత్రలో అదరగొట్టేశాడు. అఖండ తొలి పార్ట్‌లోనే తన నట విశ్వరూపం చూపించాడు. అటు రౌద్రరసంతో పాటు ఎమోషనల్‌గా ఎలా అయితే చూశాడు ఈ సీక్వెల్లోనూ దానికి కొనసాగింపుగా పాత్రలో లీనమయ్యాడు. తల్లి చనిపోయినప్పుడు, పిల్లతో సంభాషణల్లో ఎమోషనల్‌గాను, యాక్షన్లోనూ రౌద్ర రసం పండించడంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. బాలమురళీ కృష్ణగా రెండో పాత్ర చేసిందేమి లేదు. సంయుక్త మీనన్ పాత్ర ను ఫస్టాఫ్‌లో నే చంపేశాడు. ప్రగ్య జైశ్వాల్ ఫొటోకు దండం వేసి ,చూపించారు. సంయుక్త పాత్ర ను కూడా జాజికాయ సాంగ్‌తో పాటు నాలుగైదు సీన్లత ముగించేశారు. నిస్వార్థమైన తల్లి కోసం ఏదేవుడు అయినా దిగి రావాల్సిందే అంటూ శివుడు అఖండ తల్లితో చెప్పిన డైలాగులు బాగున్నాయి. మనకు శాంతిని బోధించే బుద్ధుడు తెలుసు.. వాళ్లకు యుద్ధం చేసే రుద్రుడు తెలుసు లాంటి డైలాగులు కూడా బాగున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.