అఖండ 2 లో అంత కొత్తగా ఏం ఉంది... ఫైనల్ రిపోర్ట్ ఇదే... !
అఖండ 2 - తాండవం ఆడేస్తూ థియేటర్ల లోకి వచ్చింది. అసలు బాలయ్య లో ఏం ఉందా అని చూస్తుంటారు కాని అందరి అంచనాలు మించి బాలయ్య ఉంటాడు అనే వాళ్లు ఉన్నారు. అది యాక్షన్ సీక్వెన్స్‌లో మాత్రం నూటికి నూరు శాతం వర్తిస్తుంది. తన అభిమానులు ఏం కోరుకుంటారో అది ఇవ్వటం బాలయ్య కే సాద్యం,అలాంటి బాలయ్య కి బోయపాటి తోడైతే అధి విధ్వంసం. అఖండ 2 లో కథ ఎలా ఉన్నా బాలయ్య పాత్రగా చూస్తే మాత్రం ఏమని వర్ణించాలో తెలియనంత గొప్పగా ఉంది. ఏ సీన్ అని వర్ణించాలి, వృషభాలతో బాలయ్య ఏంట్రీ చెప్పనా, అఖండుడే ఆవాహించిన హరుడు గురించి చెప్పనా ? బాలయ్య ని నిలువునా పూనిన బలశాలి వీరహనుమాన్ గురించి చెప్పనా.? తాంత్రికుడిని నిలవెళ్ల చీలిన ప్రళయ రుద్ర నరసింహుడి గురించి చెప్పనా . ? శివ శివ శంభో ఆ తమన్ బీట్ కి గుండె కూడా అదురుతుంది .. అమృతం తాగి కొట్టినట్టు ఉన్నాడు. బాలయ్య నట విశ్వరూపానికి థమన్ కొట్టుడు తోడు కావడంతో థియేటర్లలో శివుడు తాండవం ఆడినట్టుగానే ఉంది. బోయపాటి ని మించిన దేశ భక్తుడు, బోయపాటిని మించిన హైందవుడు , బోయపాటిని మించిన బాలయ్య భక్తుడు ఈ చరిత్ర కి రాబోరు అన్నంతగా బోయపాటి బాలయ్యను చూపించాడు. కానీ కథ మీద కథనం మీద కాస్తంత దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా రేంజ్ వేరుగా ఉండేది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.