అఖండ 3 ఉండబోతోంది..హింట్ చూశారా..?
ఈ చిత్రంలో బాలయ్య తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విభిన్నమైన పాత్రలలో గెటప్పుతో ఆకట్టుకున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అఖండ 2 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.. అఖండ 2 చివరిలో" జై అఖండ" అనే పేరుతో అఖండ 3 టైటిల్ తో మూడో భాగం రాబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చినట్లుగా అభిమానులు భావిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉంది ఇందులో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, తదితర నటీనటులు ఇందులో కీలకమైన పాత్రలు నటించారు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పైన నిర్మించారు.
అఖండ 2 సినిమాకి సంబంధించి సినిమా టికెట్ల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో న్యాయవాది శ్రీనివాసరెడ్డి సినిమా టికెట్ల రేట్లు పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పాస్ చేశారు. ఈ విషయం పైన విచారణ జరిపిన న్యాయస్థానం.. టికెట్ రేట్స్, ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ జారీ చేసిన జీవోను కూడా కొట్టేసింది.. ఈరోజు మధ్యాహ్నం వాదనలు విన్న తర్వాత తాజాగా ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. దీంతో తెలంగాణలో అఖండ 2 చిత్రానికి సంబంధించి టికెట్లు రేట్స్ పెంచుకునే అవకాశం కల్పించింది.
తెలంగాణ లో టికెట్ల ధరల పెంపు పైన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ఇకనుంచి సినిమా టికెట్ల ధరలు పెంచే అవకాశం ఉండదని.. దర్శక నిర్మాతలు తమ వద్దకు టికెట్లు ధరలు పెంచమని అడగవద్దని చెప్పారు. అంతేకాకుండా హీరోలకు రూ .100 కోట్ల రూపాయలు ఎవరు ఇమ్మన్నారు అంటూ ప్రశ్నించారు? . తక్కువ ధరలు ఉంటేనే కుటుంబం అంతా వచ్చి సినిమాకి చూస్తారని ఆ విధంగానే మంచిదంటూ సూచించారు.