అఖండ 2: ఏపీ, తెలంగాణ ప్రీమియర్ షో కలెక్షన్లే అన్ని కోట్లా...!
గాడ్ ఆఫ్ మాసెస్ .. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా ‘ అఖండ 2 ’ అన్ని అడ్డంకులను దాటుకుని గురువారం రాత్రి ప్రీమియర్ షోల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింహా - లెజెండ్ - అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ తర్వాత మరోసారి బాలయ్య - బోయపాటి శ్రీను జోడీ కట్టడంతో ఈ అఖండ 2 - తాండవం భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ప్రీమియర్ షోలను చూసేందుకు ఏపీ - తెలంగాణ వ్యాప్తంగా నందమూరి , తెలుగు సినీ అభిమానులు థియేటర్ల కు క్యూ కట్టారు.
దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ప్రీమియర్ షోల రూపంలోనే దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు నిర్మాతలు స్వయంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు ఏపీ , తెలంగాణ లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని .. ఈ వీకెండ్స్ లో కలెక్షన్లు మరింత పెరుగుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య నట విశ్వరూపం ప్రేక్షకులను స్టన్ చేస్తుందని.. బోయపాటి టేకింగ్, థమన్ థండరింగ్ సౌండ్ ఓ రేంజ్ లో ఉన్నాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెపుతున్నారు. శని , ఆదివారాల్లో అఖండ 2 బుకింగ్స్ అదర గొడుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.