ది రాజా సాబ్: అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ములేపేతున్న ప్రభాస్..!

Divya
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 9వ తేదీన భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. విడుదలకు ఇంకా నెలరోజులు సమయం ఉండగానే చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు. ఇటీవల విడుదలైన మొదటి రెబల్ సాంగ్ మంచి హైప్ క్రియేట్ చేయగా త్వరలోనే రెండో పాటను కూడా విడుదల చేయబోతున్నారు.


తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కూడా నార్త్ అమెరికాలో మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100K డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.83 లక్షల రూపాయలు) పైగా వసూలు సాధించినట్లు వినిపిస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే అమెరికాలో ప్రభాస్ క్రేజీ ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపడితే కచ్చితంగా ఓవర్సీస్ మార్కెట్లో రాజా సాబ్ సినిమా మరింత హైప్ పెరగడం ఖాయమని ట్రెండ్ వర్గాల తెలియజేస్తున్నాయి.


ఈ బడా ప్రాజెక్టులో ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ నటిస్తున్నారు. ఈ చిత్రం హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ ఆలస్యం వల్ల వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కాబోతోంది. మరి ఇటువంటి తరుణంలో బాక్సాఫీసు వద్ద ఎలాంటి ప్రభంజనం ప్రభాస్ సృష్టిస్తాడో చూడాలి మరి. ఈసారి సంక్రాంతి పోటీకి (జననాయగన్ , మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి, పరాశక్తి) భారీగానే సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈసారి సంక్రాంతి విన్నార్ గా ఎవరు నిలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: