టాలీవుడ్: వచ్చేయేడాది హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న డైరెక్టర్..?

Divya
టాలీవుడ్ లో ఈ యేడాది సెలబ్రెటీలు సైతం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అలా అఖిల్, సమంత, అవికాగోర్, మరి కొంతమంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు తాజాగా వచ్చేయేడాది మరొక జంట ఒకటి కాబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రలతో డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ప్రముఖ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈషా రెబ్బా ప్రేమాయణం నడుపుతున్నట్లుగా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.



వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లి వైపుగా అడుగులు వేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చేయేడాది ఏప్రిల్ నెలలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా నటుడుగానే రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బా తో కలసి ఓం శాంతి శాంతి శాంతిః అనే మలయాళ సినిమా అని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగిందని అది ప్రేమగా మారిందనే విధంగా సినీ వర్గాలలో బలంగా వినిపిస్తున్నాయి.


ఇటీవల ఈ జంట కలిసి తిరుగుతూ కనిపిస్తూ ఉండడంతో ఈ విషయానికి మరింత బలాన్ని చేకూర్చింది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ ను యాంకర్ అడిగిన ప్రశ్నకు తన జీవితంలో గొప్ప ప్రేమ కథ ఇప్పుడే నడుస్తోందంటూ పరోక్షంగానే హింట్ ఇచ్చేశారు. అలాగే హీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలలో కూడా ఈ జంట కలిసి కనిపించారు.  తరుణ్ భాస్కర్ కు గతంలోనే పెళ్లై విడాకులు తీసుకున్నట్లు కొన్ని కధలైతే వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మాత్రం ఇప్పటివరకు తరుణ్ భాస్కర్ గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ  తెలియజేయలేదు. ఇటువంటి తరుణంలోనే  ఇప్పుడు ఈషా రెబ్బా తో పెళ్లిపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: