జననాయగన్ సినిమా కోసం అలాంటి ప్లాన్.. పొలిటికల్ మైలేజ్ కోసమేనా..?

Divya
కోలీవుడ్ హీరో, విజయ్ దళపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్ తోనే ఇటీవల పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. తాజాగా డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జననాయగన్. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు రకాల అప్డేట్లను ఇస్తూ వస్తోంది చిత్ర బృందం. ఈ సినిమా ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలో చాలా గ్రాండ్గా చేయబోతున్నట్లు వినిపిస్తోంది.


ఇప్పటికే విజయ్ దళపతి కచేరి సాంగ్ కూడా విడుదల అవ్వగా భారీ రెస్పాన్స్ లభించింది. ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఫెస్టివల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సింగర్ అనిరుధ్ ఇటీవలే తెలియజేశారు. వేలాదిమంది అభిమానుల మధ్య విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతోంది అంటూ హింట్ ఇచ్చారు. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే లాస్ట్ సినిమా అవ్వడం చేత అభిమానులకు మర్చిపోలేని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు అనిరుధ్ తెలియజేశారు.


ఆ సర్ ప్రైజ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 27 వరకు ఆగాల్సిందే అంటూ తెలిపారు. ఈ సినిమా విజయ్ కి పొలిటికల్ మైలేజ్ కూడా తీసుకువచ్చేలా ప్లాన్ చేశారనే టాక్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విజయ్ పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇవ్వకముందే ఈ సినిమా లాస్ట్ సినిమాగా అన్నట్లుగా వినిపించింది. జననాయగన్ లో విజయ్ కనిపించే తీరు కూడా మరింత హైలెట్ గా ఉంటుందని పొలిటికల్ బేస్ స్టోరీగా తెలుస్తోంది. జననాయగన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ రాబడతాయని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఆడియో ఈవెంట్ తర్వాత ఎలాంటి హైప్ ఏర్పడుతుందొ చూడాలి మరి. ఇందులో పూజ హెగ్డే, మమిత బైజు తదితరు నటీనటులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: