మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు రిలీజ్ డేట్ సెంటిమెంట్ చూశారా...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వేగంగా అడుగులు వేస్తోంది. బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొనిదెల నిర్మిస్తున్నారు. స్మితా ఆర్చన సమర్పిస్తున్నారు. తాజాగా నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతికి కేవలం రెండు రోజుల ముందే, సోమవారం రోజు రిలీజ్ కావడం విశేషం. దీని వల్ల ఏడు రోజుల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ దక్కనుండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఈ సినిమాలో చిరంజీవి ఎలిగెంట్ లుక్‌లో కనిపించనున్నారు. కళ్లద్దాలు పెట్టుకుని, కారుపై కూర్చొని చేతిలో కాఫీ కప్‌తో కనిపించే ఆయన లుక్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్‌గా మారింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయుధాలు పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది కనిపించడం కథపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా విక్టరీ వెంక‌టేష్ కీలకమైన స్పెషల్ రోల్‌లో కనిపించనున్నారు. చిరంజీవి - వెంకటేష్ కలయిక తెరపై మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. హీరోయిన్‌గా న‌య‌న‌తార నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. వీవీటీ గణేష్ కూడా కీలక పాత్రలో మెరవనున్నారు.


ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విక్ట‌రీ వెంకటేష్ పుట్టిన రోజు కావ‌డం విశేషం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. తమ్మిరాజు ఎడిటింగ్, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. కథను ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కలిసి రచించారు. మొత్తానికి, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత ఊపందించేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: