ఓజి× మసక మసక సాంగ్‌తో దుమ్ము దులిపేసిన సింగర్ స్మిత
ఈ సాంగ్ ని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద లాంచ్ చేశారు. ఆయన కూడా నా జర్నీలో అన్ని రకాలుగా భాగమై ఉన్నారు. ఆయన ప్రోత్సాహం ఎంతో బలాన్ని ఇస్తుంది. నార్త్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా పాపులర్ అవుతుంది. సౌత్ లో మాత్రం నేను ఆపినచోటే ఆగిపోయింది. మళ్ళీ అలా ఆగకూడదని ఒక చిన్న బెంగ వచ్చింది. మళ్ళీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. సంక్రాంతికి ఒక పాట వస్తుంది. మేమే పండగ తీస్తున్నాం. ఆ పాట ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఇకపై వరుసగా పాటలు రాబోతున్నాయి. మార్చి చివరి నుంచి లైవ్ షోస్ కూడా ఉంటాయి. హైదరాబాద్, ఆంధ్రాలో రెండు లొకేషన్స్, యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ లో కూడా ఈవెంట్స్ ఉంటాయి.
డైరెక్టర్ దేవా కట్టా మాట్లాడుతూ... ఇది నాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. స్మిత గారి కుటుంబం నా కుటుంబం లాంటిదే. పదేళ్లుగా నా జీవితంలో ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. చాలా కష్టమైన సమయంలో నాతో పాటు ఉన్నారు. స్మిత ఓజి కాదు మాడ్ మాన్స్టార్ తను ఈ ఆలోచన చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. తన ఆలోచనలు చాలా క్రేజీగా ఉంటాయి. తను ఫస్ట్ తెలుగు పాప్ స్టార్ గా ట్రెండ్ సెట్టర్. అందరికీ ఇన్స్పిరేషన్. ఈ సాంగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను.
డైరెక్టర్ విజయ బిన్నీ మాట్లాడుతూ.. ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్. నా సినిమా ప్రయాణంలో స్మిత గారు చాలా కీలక పాత్ర పోషించారు.స్మిత గారు నిర్వహించిన డాన్స్ షోలో నేను విన్నర్ గా నిలిచాను. ఆవిడే నాకు డాన్సర్ కొరియోగ్రఫీ కార్డు ఇప్పించారు. ఆ తర్వాత నాగర్జున గారితో పరిచయం ఏర్పడి నా స్వామి రంగా సినిమాకి డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత స్మిత గారు ఈ మ్యూజిక్ వీడియో గురించి చెప్పారు. ఆవిడ చెప్పిన వెంటనే నేను చేస్తానని చెప్పను. ఎందుకంటే వారి పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. రెండు అద్భుతమైన పాటలు షూట్ చేసాము. మరో సాంగ్ కూడా రాబోతుంది.
నోయల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. స్మిత గారి కం బ్యాక్ అందరికంటే ఎక్కువగా హ్యాపీనెస్ నాకే వచ్చింది. ఎందుకంటే వారితో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నాను. స్మిత గారు అంటే అందరికీ ఇష్టం. నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడానికి ఇన్స్పిరేషన్ స్మిత గారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ కి చాలా డెడికేషన్ కావాలి. ఈ పాటలన్నీ కూడా మేము చాలా డెడికేషన్ తో చేశాను. తప్పకుండా మీ అందర్నీ గొప్పగా అలరిస్తాయి.