పాపరాజి: స్టార్ హీరోయిన్స్ బర్తడే వేడుకలపై.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..!

Divya
బాలీవుడ్ నటులంతా ఎక్కువగా ముంబై ప్రాంతంలోనే ఉంటారని, వారు అక్కడినుంచే షూటింగ్ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అయితే సెలబ్రెటీలు ఎయిర్ పోర్ట్లో కనిపిస్తే చాలు వారిని వెంబడించి మరి ఫోటోలు , వీడియోలు తీయడం సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో ఈ హడావిడి చూసిన చాలామంది నెటిజన్స్ సైతం ఏంటి ఈ సెలబ్రిటీలకు ఇంత క్రేజీ ఉందా అంటూ ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా చాలానే చూశాము. కానీ ఈ పాపరాజీ వెనుక ఉన్న హంగామా గురించి ప్రముఖ హీరోయిన్ ప్రియమణి అసలు విషయాన్ని బయటపెట్టింది.



ముంబైలో సెలబ్రెటీలను వెంటాడే పాపరాజీల వెనుక ఉండే అసలు విషయాన్నీ బయటపెట్టింది. ముంబైలో సెలబ్రెటీలు తమకు పబ్లిసిటీ పెంచుకోవడం కోసమే డబ్బులు ఇచ్చి మరి అలా వారిని నియమించుకుంటున్నారేమో అంటూ  ప్రియమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి. అలా పాపరాజీ చేయించుకోవడం వల్ల సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతుందని దీంతో సినిమా అవకాశాలు వస్తాయని ఇలా అన్నిటికీ కూడా ఉనికి పెంచుకోవడం కోసమే ఇలాంటి పని చేస్తున్నారేమో అన్నట్టుగా తన అభిప్రాయం  అని తెలిపింది ప్రియమణి.



ఇటీవల కాలంలో పాపరాజీల వల్ల సెలబ్రెటీలకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసులలో సెలబ్రిటీలకు సడన్గా బర్తడే సర్ప్రైజ్ లాంటి సరికొత్త ట్రెండ్ కొనసాగుతోంది. ఆమధ్య హీరోయిన్ పూజ హెగ్డే ఎయిర్ పోర్ట్లో పాపరాజీలు ఆమె చేత కేక్ కూడా కట్ చేయించారు. ఈ సర్ప్రైజ్ కి పూజా హెగ్డే అమాంత సంబరపడిపోయింది. ఇటీవల రీసెంట్గా మరొక హీరోయిన్ రుక్మిణి వసంత కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ముంబైలోని బాంద్రాలో కలిసిన పాపరాజీలు ఆమెతో హఠాత్తుగా కేకు తీసుకొచ్చి మరి కట్ చేయించారు. ఈ సర్ప్రైజ్ ఆమెకు చాలా ఆనందంగా కలిగించిందని ధన్యవాదాలు కూడా తెలియజేసింది. పాపరాజీల ట్రెండ్ మాత్రం ఇప్పుడు సెలబ్రిటీలకు మరింత పాపులారిటీ తీసుకువచ్చేలా చేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: