అఖండ 2 : ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్లు ... బాల‌య్య‌ రిక‌వ‌రీ ఎంత‌ అంటే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2: తాండవం' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన తాండవాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లను రాబట్టింది. ప్రీమియర్స్, ఫస్ట్ డే వసూళ్లు కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా రు. 59.5 కోట్లకు పైగా గ్రాస్‌ను కొల్లగొట్టి ,  బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా రికార్డు సృష్టించింది. రెండో రోజు కలెక్షన్లు కూడా డీసెంట్‌గా నమోదయ్యాయి. అయితే, వీకెండ్‌లో అత్యంత కీలకంగా భావించే ఆదివారం ( డే 3 ) కలెక్షన్లపై అందరి దృష్టి ఉంది. తాజా ట్రేడ్ లెక్కల ప్రకారం, బుక్‌మైషో వంటి ప్లాట్ ఫామ్‌లలో టికెట్ బుకింగ్‌లు అనూహ్యంగా పెరిగాయి. ఒకానొక దశలో కేవలం గంటలో నే 15,000 లకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ఈ క్రేజ్ చూసి అభిమానులు ఉప్పొంగ‌గా.. ట్రేడ్ వ‌ర్గాలు సైతం షాక్ అయ్యాయి.


సినిమా పై ముందు నుంచి ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే, సినిమా మూడో రోజు స్థిరమైన ప్రదర్శన కనబరిచి, మొదటి వారాంతంలో ఇండియా వైడ్ రు. 61 కోట్ల నెట్ కలెక్షన్లను దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రు. 120 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా అధిగమించినట్లు సమాచారం. ఈ పాన్ - ఇండియన్ బిగ్‌గీలో బాలకృష్ణతో పాటు సంయుక్త మీనన్ , ఆది పినిశెట్టి , హర్షాలీ మల్హోత్రా , కబీర్ దుహాన్ సింగ్ వంటి నటీనటులు కీల‌క పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ బ్యాన‌ర్ పై రామ్ ఆచంట‌, గోపీనాథ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రానికి థ‌మన్ ఎస్‌. ఎస్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: