సంక్రాంతి సినిమాల కన్ఫ్యూజన్ !
దీనికితోడు ఈమధ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు ఇక రానున్న రోజుల్లో విడుదల కాబోతున్న ఏసీనిమాలకు టికెట్ల రేట్ల పెంపుదల ఉండదని చెపుతున్న నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంపుదల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు సంక్రాంతి సినిమాల బియ్యర్లకు రావడంతో ఈ కన్ఫ్యూజన్ సంక్రాంతి సినిమాల బిజినెస్ పై భారీ స్థాయిలో ఉండే ఆస్కారం ఉంది అని అంటున్నారు.
అంతేకాకుండా గతవారం ఎటువంటి పోటీ లేకుండా విడుదల అయినప్పటికీ ‘అఖండ 2’ కు కలక్షన్స్ అంతంతమాత్రంగా ఉండటంతో సంక్రాంతి సినిమాల బయ్యర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు టాక్. ఇవన్నీ ఒక ఎత్తైతే సగటు ప్రేక్షకుడు ఇన్ని సినిమాలను పండగారోజులలో ఎంతవరకు చూస్తారు అన్న సందేహాలు మరికొందరిలో ఉన్నాయి. అయితే సంక్రాంతి సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి సమస్యలు ఉండకపోవచ్చనీ టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సమస్యలు రాకపోవచ్చనీ మరొక విశ్లేషణ కూడ వినిపిస్తోంది.
అయితే తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి బాగా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఒక కుటుంబం పండుగరోజులలో రెండు తప్పితే మూడు సినిమాలకు మించి చూసే ఆస్కారం చాలచాల తక్కువ. దీనితో పండుగ సీజన్ లో విడుదల అయిన అన్ని సినిమాలను సగటు ప్రేక్షకుడు చూసే ఆస్కారం లేదు. దీనికితోడు టిక్కెట్ రేట్ల పెంపుదల కూడ సినిమాల పై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ఈసారి పండగ రోజులలో ఓటీటీ లలో చాల కొత్త సినిమాలు స్ట్రీమ్ అయ్యే ఆస్కారం ఉంది. ఇన్ని సమస్యల వలయాలను దాటుకుని సంక్రాంతి సినిమాలలో ఏసీనిమా విజేతగా నిలుస్తుంది అన్నది సందేహమే..